LOCAL WEATHER

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

విశాఖ పేరు వైజాగా....వాల్తేరా....? ? ?


    ఆంధ్రజ్యోతి లోనిది...


విశాఖపట్టణం  పాత పేరు వాల్తేర్  అని  వ్రాశారు....
అది  తప్పు.... 
విశాఖ పేరు  విశాఖే....  
కాకపొతే,  ఇంగ్లిషు  గాడిదల  నోటికి  తిరగక...
విశాఖ  స్పెల్లింగును  వైసాక్  వైజాగ్ గా  మార్చుకుని  
తమ  గాడిద  నోరుకి  పట్టేట్లు  సరి  చేసుకుని  అలానే  పిలవ సాగారు.... 
అయితే, అప్పటి  జనం నోళ్ళు  భారతీయమే కాబట్టి  
అది  విశాఖ గానే పిలవబడింది.... 
ఇప్పుడు  దిక్కుమాలిన  మీడియా  వచ్చిన తరవాత  
దానిని  వైజాగ్  అని  పిలవటం  ఓ  ఫేషన్  అయిపోయింది... 
ఇంగ్లిషు  వారు  వెళుతూ  వెళుతూ  వదలిన  
గాడిద  ఎంగ్లి పీసు నోరుని  
ఇప్పుడు  చదువుకున్న  వారూ  చదవని  వారు  తగిలించుకుని  
వైజాగ్  అని  ఓoడ్ర పెడుతున్నారు....

ఇకపోతే,  
అప్పట్లో  పాత  పోష్టాఫీసు దగ్గర  విశాఖ  రైల్వే స్టేషను  అని  మరొకటి  ఉండేది....
వాల్తేర్ అనేది  అక్కడి  ఓ  ప్రాంతం  పేరు...
ఆ  ప్రాంతంలో  మరొక రైల్వే  స్టేషను  ఉన్నది  
కాబట్టి దానికి  వాల్తేర్  అని  పెరేట్టారు.... 
తరవాతి కాలంలో  విశాఖ స్టేషను  ఎత్తేశారు...
వాల్తేర్  స్టేషనే  విశాఖ  స్టేషనుగా చలామణి  అయ్యింది...
చాలాకాలం  తరవాత దానిని  విశాఖ రైల్వే స్టేషనుగా  మార్చారు... 
అంతే గానీ, 
విశాఖకి  వాల్తేర్  అనే  పేరు  ఎప్పుడూ  లేదు....

"డు ము  వు" గురించి  తెలియని  మా  తెలుగు...
మా  విశాఖ  అంటూ  దొర్లే  రాజకీయ  నాయకులు  గానీ,  
సంఘ సంస్కర్తలు  గానీ  
ఇలా  విశాఖ  పేరుని  ఖూని  చేస్తే  పట్టించుకోలేదు...

కానియ్యండి  ఏం  చేద్దాం.... 
గోదావరి  అని  ఉంటే  గోడావరి అని...
నర్సాపురం  అని  ఉంటే... నర్సాపూర్  అని...
పాలకొల్లు  అని  ఉంటే...పాలకొల్ అని...
నెల్లోర్...అనంటపూర్....
అలానే చక్కటి  విశాఖపట్టణం  పేరు  ఉంటే  
దానిని  వైజాగ్  అని పిలవటమే  గొప్ప  అని  అనుకునే  జనం  ఉన్నంత వరకూ  
ఎవరు మడుకు  ఏమి చెయ్యగలరు...

@@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@@@