LOCAL WEATHER

15, జులై 2012, ఆదివారం

వానాకాలం చదువులు



అది జోరున వాన.......విపరీతంగా కురుస్తోంది....పైగా ఉదయాన్నే...అందులోనూ ఆదివారం....ఇంకేమున్నది కంప్యుటర్ ఆన్ చేసి దానిలో చక్కటి ఇనుస్ట్రుమెంటల్ మ్యుజిక్ పెట్టుకొని అల్లా బయటకు చూస్తూ కూర్చున్నా.

మా ఇంటి దగ్గరే ఒక ట్యూషను ఉన్నది. దానికి రోజూ ఉదయాన్నే, సాయంత్రం చాలా మంది పిల్లలు వచ్చి చదువుకుంటూ ఉంటారు. చాలా మంది ప్రతీ సారి వచ్చి తమ పిల్లలను దింపి వెళుతుంటారు. అబ్బా, వెనుకటి రోజులకన్నా రోజుల పిల్లల మీద తల్లిదండ్రులకి ఎంత శ్రద్ధ అని అనుకునే వాడిని.


ఇది వరకు కాలంలో అయితే, ఇంత వర్షం పడితే మాకు మేమే ఒక నిర్ణయానికి వచ్చి శుబ్బరంగా స్కూళ్ళు...ట్యూషన్లు ఎగ్గొట్టేవాళ్ళం. పెద్దలు కూడా వెంట వచ్చి దింపేంత శ్రద్ద చూపించే వారు కాదు. మానేసినా ఏమీ అనేవారు కాదు. పెద్దయ్యిన తరవాత ముదిరిన మైండుతో ఆలోచిస్తే " పాతకాలం వాళ్ళు కదా చదువుల గురించి ఏమి తెలుసులే' అని అనుకునే వాణ్ణి. ఇప్పటి పెద్దలను చూస్తే కూడా నిజమనిపించేంతగా ఉండేది....!!! వానాకాలం చదువులు......!!!!


కానీ, జోరువానల్లో కొందరు ఉదయాన్నే గొడుగులు వేసుకొని తమ పిల్లలను దింపుతుంటే, మరి కొందరు పిల్లల చేతికి గొడుగులు ఇచ్చి పంపిస్తుంటే, మరికొందరు శ్రద్ధగా రైన్ కోటు తొడిగి ట్యూషన్కి పంపిస్తుంటే.....ఇదంతా పిల్లల మీద ప్రేమేనా.......? పిల్లల భవిష్యత్తుమీద భయమేనా........?? వారి కెరియర్ మీద శ్రద్ధేనా.........??? అని అనిపించింది.


ఎందుకంటే, ఇంత వానలో ఒక్క పూట రాకపోతే పోయేదేమున్నది......??? ఇలా అలోచిస్తే, పిల్లల భవిష్యత్తు మీద కన్నా "తమ భవిష్యత్తు మీద శ్రద్ధేమో" అనిపించింది. కోళ్ళ ఫాం లో కోళ్ళను చక్కగా పెంచి...మాంచి గుడ్లు పెట్టేట్ట్లు చేసే నిర్వాహకులకి కోళ్ళ మీద ప్రేమ కంటే వాటి గుడ్ల మీద వచ్చే ఆదాయమే కనపడుతుంది. అలాగే, ఇప్పటి వెర్రి చదువుల అతి శ్రద్ధ చూస్తుంటే తల్లిదండ్రులకి తమ పిల్లల మీద శ్రద్ద కన్నా, వారు పెద్దైన తరవాత తెచ్చే పేద్ద జీతాల మీదే మమకారం ఎక్కువేమో.....అందుకేనేమో ఇంత విపరీత ఆశక్తి కనపరుస్తున్నారేమో అని అనిపించక మానదు.....


ఇందుకేనేమో పాత కాలంలో పిల్లల చదువుల మీద ఇంత విపరీత శ్రద్ద లేదు మన పెద్దలకి......మరి వారికి పిల్లల మీద ఆధార పడి బ్రతకాలన్న దూ[దు]రాలోచన లేదు కదా.....కేవలం వర్షంలోనూ, ఎండల్లోనూ తమ పిల్లలు కష్టపడ కూడదన్న ఆలోచన తప్ప........


బహుశా కారణంతోనే ఇప్పుడు వృద్ధశ్రమాలకి విపరీత డిమాండు పెరిగిపోతున్నది.......అవును మరి తల్లిదండ్రులు "పెట్టుబడి" అనుకునేది అమాయక  కోళ్ళ మీద కాదు కదా .....అన్నీ తెలిసిన పిల్లల మీద.....!!!!!


2 కామెంట్‌లు:

  1. తల్లిదండ్రులపై సుతారంగా కొరడాను ఝలిపారుగా...
    తల్లిదండ్రులు "పెట్టుబడి" అనుకునేది అమాయక కోళ్ళ మీద కాదు కదా అన్నీ తెలిసిన పిల్లల మీద!భలేచెప్పారు.Congrats!

    రిప్లయితొలగించండి