LOCAL WEATHER

23, ఫిబ్రవరి 2013, శనివారం

హైదరాబాదు పేలుళ్లపై తొందరపడి ఓ నిర్ణయానికి రాకూడదంట.....!!!

TOO EARLY TO BLAME ANYONE FOR BLAST, SAYS SHINDE..........THE HINDU DAILY NEWS PAPER.

నిన్న హైదరాభాదులో జరిగిన సంఘటన మీద స్పందిస్తో మన హోం మినిస్టరు గారు ఇలా అన్నారు.  నిజమే ఏ విషయం పట్లా తొందరపాటు పనికిరాదు.  కానీ.  టెర్రరిస్టులపట్ల ఉన్న భయభక్తులు,  హిందువుల పైన లేవు. ఉగ్రవాదులపట్ల ఉన్న సంయమనం  హిందువుల పట్ల లేదు. హిందూ ఉగ్రవాదం ఉన్నదని నోరు జారి, తరవాత నాలిక కొరుక్కుని సారి చెప్పి.... నేను అలా అనలేదు మీడియా వక్రికరించిందని విచారాన్ని వ్యక్తపరచారు.  

ప్రతీ వాళ్ళకి మీడియా ఒకటి అడ్డంగా దొరికిపోతోంది. ఎవరి నోటికొచ్చినట్లుగా వారు మాట్లాడి, దాని మీద ఏదైనా గొడవ జరిగితే  "మీడియా వక్రీకరించింది" అని మీడియా మీదకి తోసేస్తున్నారు. ఆ మీడియాలో వచ్చిన వార్తలని ప్రత్యక్షంగా చూసి,  విన్న వారి సంగతి ఏమిటన్న సంగతి వీరికి పట్టటంలేదు. మొన్నటికి మొన్న ఒకాయన కేవలం ఒక రాష్ట్ర విభజనకోసం తలలు తెగిపడతాయన్నారు, పనికిమాలిన వారు అన్నారు, ఇలా రకరకాలుగా స్టేజీల మీద ఉన్మాదపు వీరంగం వేసేసి తరవాత మీడియా వక్రీకరించిందని తమ అసందర్భ ప్రేలాపనలని కప్పిపుచ్చుకుంటున్నారు. 

మరోకడు, హిందువుల మీదా వారి దేవతల మీదా నానా ప్రేలాపనలు పేలి చివరికి రోగగ్రస్తుడయ్యాడు. అతను అన్నాడా లేదా అని వాయిస్సు టెస్టులు కూడా చేయించుకున్నాడు. కనీసం వాగిన వాగుడుకి కట్టుబడేంత దమ్మూ ధైర్యం లేని పిరికి పందలు అడ్డమైన వాగుళ్ళూ వాగటమెందుకూ...?  తరవాత ఆసుపత్రులలో చేరటమెందుకూ....???  

సరే, ఇంతకీ మీడియాని తమ ప్రచారానికి అడ్డంగా వాడుకొంటున్న వారు, ఏదైనా అవాంతరం వస్తే దానిమీదకు ఎందుకు తోసేస్తున్నట్లూ...? ఏమున్నదీ, అల్లరి పిల్లలు ఉంటే, ఏ గొడవొచ్చినా వారిమీదకు తోసేయచ్చునని, ఎలాగో వారు అల్లరి వాళ్ళే కాబట్టి ఇదంతా వారే చేశారు అని ప్రజలలో భావం కలిగించవచ్చును. పాపం ఇలా అల్లరి పిల్లలుగా ముద్రపడిన కొందరు మీడియా వారు మేలుకొని, తమ వార్తలలో నిజాయితీ, నిబద్దతా, నిస్పక్షపాతం చూపిస్తే కనుక వారి పట్ల ఉన్న భావం పోయి... వారు చెప్పినది చెప్పినట్లుగా నమ్మే పరిస్తితి వస్తుంది. అలాంటి పరిస్థితులలో ఎవరూ కూడా తమ తప్పులని మీడియా మీదకి తోసెయ్యటానికి సాహసించరు. 

ముగింపుగా, మన హోం మినిస్టరుగారికి  టెర్రరిస్టుల నిర్ణయం పట్ల ఉన్న సంయమనం, హిందువుల పట్ల కూడా ఉంటే చాలా బాగుంటుంది. హిందువులంటే బీజేపీ పార్టీ మాత్రమే కాదు అన్న సంగతి అందరూ గుర్తెరిగి మాట్లాడితే మంచిది....హిందువులని తిడితే అది బీజేపీని తిట్టినట్లు కాదని తెలుసుకొవాలి......కేవలం బిజేపీకి మాత్రమే  హిందువుల ఓట్లు అవసరం కాదు...........  ఏ పార్టికైనా  ముందర హిందువుల ఓట్లు పడ్డ తరవాతే కొసరు ఓట్లు అవసరమవుతాయని గమనించుకొంటే మంచిది.......   



@@@@ 





       

20, ఫిబ్రవరి 2013, బుధవారం

మానవ హక్కుల వారు స్పందించండి.....


నిన్న విశాఖ జిల్లాలో జరిగిన దారుణాం ఎర్ర సైన్యం అసహనానికి నిదర్శనం. ఎదో సినిమాలో డైలాగు "నేను మాట్లాడేప్పుడు చెవులు మాత్రమే పనిచెయ్యాలి......." లాగా  మన ఎర్ర వారి స్వాతంత్రం ఉన్నది. కనీసం గ్రామీణ గిరిజన ప్రాంతాలలో పెట్టిన సమావేశంలో అయినా కొద్దిగా సంయమనం, ఓర్పునీ చూపించలేని వీరు, పేద ప్రజలని ఉద్దరిస్తామని ఎలా చెప్పగలరు...???  ఇంతే అసహనం ప్రజాసామ్య వాదులకి కూడా ఉంటే  వీరి ఆటలు సాగేవా ........

జరిగిన గొడవలో గ్రామీణ గిరిజనులు రాళ్ళు వేస్తే, వీరు భయంతో తుపాకీలకి పనిచెప్పారు. ఇంత పిరికి వాళ్ళు బడుగు జనాన్ని ఎలా వృద్ధిలోనికి తెస్తారు...?? వీరిని నమ్ముకొని పేద ప్రజలు, పైన ఉన్న వారితో ఎలా పోరాటాలు చేస్తారు...??? ఇప్పటిదాకా వీరు చేసిన ఘాతుకాల్లో సామాన్య ప్రజలూ, ప్రజలకి పనికొచ్చే అధికార్లు మాత్రమే బలైపోతున్నారు. వీరి నిరంకుశ విధానంతో ప్రజలందరినీ ఏవిధంగా ఒక తాటిపైకి తెస్తారు...??

ఈ ఎర్ర సైన్యంలో అనేక హత్యలూ చేసిన వారూ, బోలెడు బాంబులు పెట్టి అనేకం పేల్చేసినవారిలో ఒక్కరు పోలిసుల చేతులో చనిపోయినా, కాకుల లాగా గోల గోల చేసే  అనేక హక్కుల వారు ఎవరూ కూడా ఈ సంఘటన పట్ల ఇంతవరకూ స్పందించలేదు.  నిన్న చనిపోయిన అమాయక గిరిజన ప్రజలు మానవులు కాదని వీరి అభిప్రాయమా....??? టీవీల వారు కూడా ఏదో విదేశాలలో జరిగిన సంఘటన అయినట్లు ఒకసారి చెప్పి ఊరుకున్నారు...... పొద్దున్నే వచ్చే "పెద్దమనుషులైన వారు" కూడా ఎందుకనో ఈ విషయంపట్ల సానుభూతితో శ్రద్దపెట్టలేదు....!!!

ఇప్పుడున్న సమాజంలో అవినీతి అక్రమాలూ ఏవో పెరిగిపోయాయన్న వీరి ఊకదంపుడు ఉపన్యాసాలు విని వీరిపట్ల సానుభూతిని చూపించినవారిని కూడా వీరు వదలకపోతే, రేపు అదేదో మరో ప్రపంచం అంటే అది వచ్చేది ఎక్కడో ...? మానవుల ప్రాణాలు పట్ల గౌరవం ఉన్న ఓ హక్కుల సమితులారా స్పందించండి... వీరికి తగిన బుద్ధి చెప్పి, ఈ తప్పిదనం మరోసారి జరగకుండా చర్యలు తీసుకొనే వరకూ పోరాడండి.... 

ప్రజాసామ్యంలో కనుక ఈ ఎర్ర సైన్యపు అసహనం, పిరికితనం  ఉన్నట్లైతే, ఈ పాటికి అనేక వేలు  కాదు లక్షల మంది ప్రాణాలు గాలిలో ఉండేవి...  ప్రజాసామ్యాన్ని తిట్టే వారికి, ప్రజాసామ్య ఉదారత్వంతో ఆటలాడుకునే వారికి,  ఇప్పటికైనా ప్రజాసామ్య విలువలు అంటే  ఏమిటో అర్ధం అవుతుందేమో ...........


@@@@ 

14, ఫిబ్రవరి 2013, గురువారం

ప్రేమికులరోజు స్పెషల్....!!! ప్రేమంటే........

 బాధ్యతగల  ప్రేమికులు 

చాలా రోజుల క్రితం   మిమిక్రి లాంటిది చెయ్యాలనిపించి చేసాను.

బాధ్యత లేని  లవ్ సినిమాల మిద చేసి, 


దానికి మన పెద్ద ఎన్టిఆర్ గారి విడియో పెట్టి యుట్యుబ్ లో పెట్టాను. 


చూసి విని ఆనందించండి......... ప్రేమికుల రోజున.........


@@@@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@@@

ఇందులోని డైలాగు:

ప్రేమంటే.... నిన్ను మీ నాన్నా దాన్ని వాళ్ళ నాన్నా పోషిస్తున్నప్పుడు వచ్చే మాటలు కాదురా !!!

ఒకళ్ళ నొకళ్ళు పోషించు కొంటె ,  అప్పుడు చూపించండి 

నిజమైన ప్రేమంటే ఏమిటో.........

ఆఆఆఆఆఆ......

@@@@@

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

"మీకు నాగరికత తెలియదా... చెంప పగలగొడతా"....!!!



కర్టేసి ఈనాడు 

ఫొటో జర్నలిజం అని పేరు పెట్టుకొని ఎక్కడబడితే అక్కడ ఎగబడి మరీ ఫొటోలు తీస్తుంటే వారిని వారించాలిసినది పోయి....... మీడియా ప్రచారానికి దాసోహమైన కొందరు  పెద్దలు మమతను విమర్శిస్తున్నారు.......  పశ్చిమ బెంగాలులో జరుగుతున్న మాటీ ఉత్సవాల్లో అత్యుత్సాహం చూపించిన ఒకానొక ఫొటోగ్రాఫెర్ మీద మమతా బెనర్జీ ...... "మీకు నాగరికత తెలియదా... చెంప పగలగొడతా" అని మండి పడ్డారుట..... అంతే ప్రతిపక్షం వారికి ఓ విషయం దొరికిపోయింది.  "నియంత్రిత పోకడలు" అనీ మరేదో పేరులు పెట్టి విమర్శించి, ప్రెస్స్ ఫ్రీడంని వీరే కాపాడేసినట్లు ఆయస పడిపోయారు. ఇంతకీ బెంగాలులో ఇప్పుడు ఉన్న ప్రతిపక్షానికి ప్రెస్స్ ఫ్రీడం అంటే అర్ధం తెలుసా...??? ఇక మీడియా వారి విషయానికొస్తే మహిళల గౌరవం అంటు రోజు తమ మీడియాలో అల్లరి చేసే వీరు "మమత నోరు జారారు" అని, "నోరు పారేసుకున్నారు" అనీ,  తమ పత్రికలలొ  అమర్యాదగా వ్రాయటం ఎంతవరకు సమంజసం.....??? 

రాజకీయ నాయకులు కానీ, సినిమా వాళ్ళు కానీ ఎదురుపడితే మన ప్రెస్స్ ఫొటొగ్రాఫెర్లకి ఒంటి మీదకి పూనకం వచ్చేస్తుంది, మీద పడి, కొట్టుకొని మరీ ఏవో ఒక "సాగర సంగమం ఫొటోలు"  తీసి పారేస్తారు... ఒక్కొక్కళ్ళూ వందల కొద్దీ ఫొటోలు తీసి ఆయా ప్రముఖులకీ, అక్కడికి వచ్చిన వారికీ కళ్ళు పోయే విధంగా ఫ్లాషులు వెలిగించి పారేస్తారు.... అలా మీదపడి ఫొటోలు తీయటమే ఫొటో జర్నలిజం'ట.....!!! ఇంతకీ  వీరికి న్యూస్ కవరేజ్ లో ఉన్న ఆదుర్దా  ఆక్కడ జరిగే  విషయం మిద అవగాహన కాని, శ్రద్ద  కానీ ఉండదు.  

ఈ రకమైన మీడియా ప్రచార మత్తు మందులకి  అలవాటైన చాలా మంది ప్రముఖులకి, ఇందులో ఇబ్బంది ఉన్నప్పటికీ సహించి ఊరుకుంటున్నారు...... కానీ, అందరూ ఒకే లాగా ఉండరు కదా; దీదీ లాంటి ప్రచారం అక్కర్లేని, సామాన్య ప్రముఖులు కూడా ఉంటారు కదా......  ఒక మహిళ అని చూడకుండా ఎగపడి   అక్కడ ఆవిడకి ఇబ్బంది కలిగించే విధంగా ఫొటోలు తీస్తుంటే వారించాలిసినది పోయి, దానికేదో ఫొటో జర్నలిజం అని పేరెట్టి, ఆ కనీస మర్యాద తెలియని వ్యక్తులని వెనకేసుకు రావటం ఎంతవరకూ సమంజసం....?? ప్రతి పక్షం అంటే విమర్శించటమే పనా...??? 

ఎందరికో నీతులు చెప్పే ఈ మీడియా వారికి "ఎవరి పొయ్య వారిది" అన్న చందాన అంత మంది ఫొటో గ్రాఫర్లు అవసరమా...??? ఏదైనా సమస్య వస్తే మటుకూ వారి సంఘానికి వెళ్ళిపోయి నానా యాగీ చేసే వారు, ఈ ఫొటోల విషయంలో కూడా ఏ కొద్ది మందినో వినియోగించి అలా వచ్చిన న్యూస్‌నీ, ఫొటోలనీ వాడుకోవచ్చును కదా... ఎవరు తీసినా ఆ నాయకుల, సినమా వాళ్ళ ముఖాలే కదా....  కనీసం ఈ మాత్రం సంయమనం, సమైక్యత  ఈ మీడియా వారి మధ్యలో   లేక ఎవరికి వారు ఎగపడితే,  అక్కడ అసలు జరిగే కార్యక్రమం అభాసు పాలవుతుంది.  కాబట్టి, వ్యక్తులకి సంబంధించిన న్యూస్ విశేషాలని సేకరించటానికి మీడియా వారు తమ యునియన్ని  వాడుకొంటే అటు మీడియా వారికీ మంచి ఫొటోలు వస్తాయి, ఇటు కార్యక్రమం జరిగేటప్పుడూ అనవసర గందరగోళం ఉండదు. ఎవరికీ వారు ఎగబడటానికి,  ప్రెస్ అంటే వ్యాపారం కాదు కదా......!!!!


@@@@





10, ఫిబ్రవరి 2013, ఆదివారం

ఈయన్ని ప్రజాసామ్య ద్రోహి అనాలా......???




వరవరరావుగారికి ఎంతో  "విశాలమైన"  హృదయం ఉన్నది. కాని,  పార్లమెంటు మీద దాడి చేయించి, ఉరికి గురైన గురు మీద పాపం అని అనగలిగిన ఆయన, అలా అనగలిగే స్వాతంత్రం ఇచ్చిన పార్లమెంటు మీద మాత్రం ఎందుకు ఆయన హృ'దయ్యం కుంచించుకుపోయింది.....?? ఇలా కనుక ఆయన గారి దండులో ఎవరైనా అన్న కానీ, అన్నారని అనుమానం వచ్చినా గానీ "కోవర్టులూ" లేక ఉద్యమ ద్రోహులూ అన్న పేరుతో వారి తుపాకీలకి పని చెప్పేస్తారు కదా....!!! 

మరి వరవరరావుగారు చేసే పని ఏమిటి??? ప్రజాసామ్యంలో ఉంటూ అది ఇచ్చిన స్వతంత్రాన్ని అనుభవిస్తూ, ఆ ప్రజాసామ్యాన్నే అపహాస్యం చేసిన వారి మీద "పాపం" అనటంలో ఆయనగారి ఉద్దేశం ఏమిటి??  ఈయన గారు ప్రజాసామ్య ద్రోహి అవ్వటం లేదా...???  ఒక వ్యవస్థలో  ఉంటూ ఆ వ్యవస్థ  ద్వారా వచ్చిన అన్ని స్వాతంత్రాలన్నీ  అనుభవిస్తూ కూడా ఆ వ్యవస్థ మీద గౌరవం లేని వరవర రావు గారి లాంటి వారి వల్లనే మన దేశంలో శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో ఇలా టెర్రరిస్టులని కొందరు వెనకేసుకురాగానే మరి కొందరు "ఆ ఇది ఓట్ల రాజకీయం" అని కొట్టి పారేస్తున్నారు..... అయితే ఇది ఎవరి ఓట్ల కోసమూ...???  అలాంటి వారు  ఉన్నారని అపోహ చెంది, అడ్డమైన వాగుడులూ వాగి, వారి మనసు గెలుచుకోవలనుకునే వారు, వారిని అవమానించినట్లే...!!!  ఎందుకంటే  ఇలాంటి టెర్రరిస్టులని  క్షమించే వారు ఏ కులంలోనూ, మతంలోనూ మన దేశంలో లేరు. నిన్న జరిగిన సంఘటన తరవాత దేశమంతా హర్షించింది....దేశమంతా ప్రశాంతంగా ఉన్నది..... ఎవరూ కూడా ఉరితియ్యటానిని అన్యాయం అని అనలేదు...ఒక్క వరవరరావు "లాంటి వారు"  తప్ప....

అయ్యా, ఎవరి జాలినో మీరు పొందాలని అనుకుంటున్నారో వారిని మీకు తెలిసో తెలియకో అవమానిస్తున్నారు. వారు విద్రోహుల పట్ల జాలిగా ఉంటారన్న అపోహతో మీకై మీరు వారిని విద్రోహుల గ్రూపులో కలిపేస్తున్నారు.... ఏదైనా మాట్లాడేటప్పుడు మీ  మాటల వలన ప్రభుత్వాన్నో, మరి ప్రజాసామ్య వ్యవస్థనో ఇరుకున పెట్టేస్తున్నామన్న సంతోషంతో బాటూ..... మీరు ఎవరి ప్రాపకం పొందాలని అనుకుంటున్నారో వారిని దేశద్రోహుల సపోర్టర్లుగా చేసి అవమానిస్తున్నారన్న సంగతి గమనించండి.

ఇకపోతే,  వరవరరావుగారు ఓ గొప్ప నిజాన్ని కనిపెట్టేశారు... మొడీ గారు 3000 మందిని ఊచకోత కోసేశారుట.........!!!  మరి ఇంత గొప్ప రహస్యం తెలిసి కూడా చట్టం సహాయం ఎందుకు తీసుకోలేదు...?  ఈయనగారి దగ్గరున్న ఆధారాలతో మోడీగారిని చట్టానికి పట్టించవచ్చును కదా.....!!!  మరి అలా ఎందుకు చెయ్యలేదు....??  అసలు ఈ వరవరరావుగారికి చట్టమంటే గౌరవం ఉన్నదా....!!!    

ఈయనగారు సపోర్టు చేసే నక్సలైట్లు, మావోయిస్టుల  వలన ఏ పాపం ఏరగని ఎన్ని వేల మంది చనిపోయారు.... పాపం ఈయనకి లెక్కలు తేలక చెప్పి ఉండకపోవచ్చును. ఇదివరలో పోలీసు వేను అనుకొని పెళ్ళి బృదం ఉన్న బస్సు క్రింద బాంబును పెట్టిన   వీరి మావోయిస్టుల [లింకు నొక్కండి]  గురించి  ఆ సమయంలో ఒక టీవీ వారు ... వారి  ఇంటర్వ్యు లో  అడిగితే,  అదేదో అడగకూడని ప్రశ్న అయినట్లుగా చూసి...... ఉద్యమంలో ఏవో జరుగుతుంటాయని తప్పించుకొన్నారు సారు గారు. పైగా ఉద్యమ కారులకి తప్ప మిగిలిన వారి మానవ హక్కుల గురించి నాకు సంబంధం లేదని తెగేసి మరీ చెప్పారు......పోలిసు వేను అనుకొని పెట్టారని సమర్ధించారు.... పొలీసు వేను క్రింద అయితే బాంబు పెట్టచ్చనా ఈయనగారి ఉద్దేశం....?   


ఏ పాపం ఎరగని "గురివిందగింజ". కేవలం ఉదాహరణ కోసం 

వీరి హక్కులు గల మానవులలో పాపం బడుగు పోలీసులు కూడా లేరు. కేవలం టెలిఫొను ఎక్సేంజులు పేల్చేసే వారు, అనుమానంతో అమాయక గిరిజనాన్ని చంపేవారు, వంతెనల క్రిందా, రోడ్ల మీద బాంబులు పెట్టేవారు మాత్రమే మానవులు. వారి హక్కుల కోసమే వీరు పాటు పడతారు. అలాంటి వారి ప్రక్కన మాట్లాడే ఈ గొప్ప మనిషికి ఉన్నట్లుండి మాములు జనం మానవ హక్కులు గభాలున గుర్తుకొచ్చేశాయి అని అనుకోవాలా...??? ఆయనకి తెలిసిన నిజమేమిటో ఆయనగారు చట్టం ముందుంచితే మర్యాదగా ఉంటుంది....అలా కాకుండా ఒక బాధ్యత ఉన్నదనుకున్న మనిషి,  ఎలా పడితే అలా అరోపణలు చేస్తే అది సమాజానికి మంచిది కాదనీ,  వీరిపై జనానికి నమ్మకం పోతుందినీ వీరు తెలుసుకుంటే మంచిది. ఇకపైనైనా పద్ధతిగా, మనది ప్రజాసామ్య దేశమనీ,  మన పైన ఒక చట్టం ఉందనీ, ఒక రాజ్యాంగం ఉన్నదనీ దానికి లోబడి ఉన్న వారి వల్లనే,  దేశమంతా చాలా ప్రశాంతంగా ఉన్నదని గుర్తెరిగి బాధ్యతగా మాట్లాడితే మంచిది.         


@@@ @@@ @@@

9, ఫిబ్రవరి 2013, శనివారం

ఆడవారంటే టీవిల వారికి లోకువా.....???



ఆడవారిని ఏదో అనేస్తున్నారనీ, మగాళ్ళూ మృగాళ్ళు అని కొత్త మాటలు కనిపెట్టిన మన నీచ టీవీలు...... అదే న్యూసు టీవీల వారు ఆడ వారంటే ఏమాత్రం గౌరవం చూపిస్తున్నారో వారి కార్యక్రమాలని చూస్తే తెలుస్తుంది.  నిన్న రాత్రి ఎన్.టీవీలో ఓ  కార్యక్రమం ......పేరు బాక్సాఫీసు అనుకుంటా... సినిమా నటి సమీరా రెడ్డి బ్యాంకు కార్డు ద్వారా 5 లక్షలు పోగొట్టుకొన్న విషయం  చెప్పిన విధానం చూస్తే ఎన్.టీవీ వారికి ఆడవారి పట్ల ఎంత గౌరవం ఉన్నదో బాగా తెలుస్తుంది. ఎవరో సమీరా రెడ్డి అభిమాని అమెరికా నుండి హ్యాకింగు చేసి ఆమె అక్కౌంటు నుండి డబ్బులు కాజేసిన విధానాన్ని ఎంత వ్యగంగా వెకిలిగా చెప్పారో.... దానికి తోడు సమయానికి తగ్గ దొంగ పాటలు పెడుతూ  ఆ విషయాన్ని ఒక హాస్య సన్నివేశంగా మార్చి వేశారు.  "దానికి తగ్గట్టు అమ్మడు అంటూ వ్యంగంగా మాట్లాడేది కూడా ఆడ అన్నౌసరే".......అందుకే అంటారేమో ఆడ వారికి  ఆడవారే  శత్రువు అని!!!!   ఎన్ టీవీలో ఎన్ అంటే బహుశా నీచమైన టీవీ అని అర్ధమేమో అని అనిపించక మానదు.   

ఇదే టీవీలలో మగ మెగా నటుల గురించి ఇదే విధమైన పధతిలో చెప్పగలరా.......? అంత దమ్ముందా........?? లేదు చెయ్యలేరు... ఎందుకంటే ఆయా హీరోల ఫ్యాన్సు దెబ్బకి ఏమి జరుగుతుంతో ఈ బజారు టీవీల వారికి బాగా తెలుసు.... స్వలింగ సంపర్కులకీ, దొంగలకీ, హత్యలూ చేసే ఫ్యాక్షనిస్టులకీ కూడా బ్రహ్మాణ్ణమైన గౌరవం ఇచ్చే  ఈ దిక్కుమాలిన బజారు టీవీలు,  ఆడవారి విషయానికి వస్తే ఎక్కడలేని వ్యంగమూ చూపిస్తాయి.... మళ్ళి పొద్దున నుండీ రాత్రి వరకూ ఆడవారి గౌరవమూ అంటూ గొప్ప మాటలు సృష్టిస్తాయి..... ఇటు ఆడవారినీ  గౌరవించక అటు మగాళ్ళందరినీ మృగాళ్ళుగా  చెప్పే   టీవీలు ఏ జాతికి చెందినవో వారికే తెలియాలి.  

ఇకమీదటనైనా, దొంగతనాలూ, హత్యలూ లాంటివి చెప్పేటప్పుడు హాస్యాన్ని జోడించే నీచ సంస్కృతికి ప్రొత్సాహం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తిసుకొంటే మంచిది.... చాలా వాటికి స్పందించే ఆడ సంఘం వారు కూడా,  టీవిల వారు  ఆడవారి పట్ల ఉపయోగించే "అమ్మడూ గిమ్మడూ" లాంటి వ్యంగమైన  పదాలని ఉపయోగించకుండా,  గ్యాసిప్స్ కార్యక్రమం పేరుతో ఆడవారిని అక్రమంగా చూపించకుండా తగిన బుద్ధి చెపితే బాగుటుంది.  



@@@@@@@@@@@@@