LOCAL WEATHER

20, నవంబర్ 2016, ఆదివారం

కొత్త రు. 2000 నోట్ మీద స్కేనర్ పనిచేస్తోందా....

కర్టేసి: ఫేసు బుక్కు...

ఈ  మధ్యన నోట్లు  మార్చిన  తరవాత 
కొత్త  రు. 2000 నోటు రావటం అందరికీ తెలిసింది.....
దీని మీద అనేక కధనాలు  వచ్చినాయి....
కొందరు దానిమీద  తప్పులు  వచ్చినాయని,
మరికొందరు అది  చేరిగిపోతుందని...
ఇప్పటికే దాని  దొంగ నోటు కూడా  వచ్చింది అని 
రకరకాలుగా పుకార్లు వచ్చినాయని....
దానికో స్కానర్ ఆప్ కూడా కనిపెట్టారు...

సరే, 
ముందరగా దానిమీద  తప్పులు  వచ్చినాయని...
అయితే, 
అది అవాస్తవం అని తేలింది...
స్క్రిప్ట్ లేని భాషలకి  హిందీ  అక్షరాలూ  వాడటం వలన అది అలా  అనిపించింది అని  తేలింది.

ఇక అది  చెరిగిపోతుందని...
ఈ  విషయాన్ని నిర్ధారణ చేసుకో కుండానే  
ఓ  బాధ్యతాయుత పదవిలో ఉన్న  వ్యక్తి  కూడా 
"అది చేరిగిపోతేనే నిజమయిన నోటు" అని అనేశాడు....
ఆయన ఎవరో  కాదు...
అయన ఆర్ధిక వ్యవహారాల ప్రధాన కార్యదర్శి శక్తి కాంత్ దాస్....
నిజానిజాలు తెలుసుకోకుండానే..
ఫుట్ పాత్  వ్యాపారిలాగా....
మామూలు  గుమాస్తాలు  లాగానే  మాట్లాడాడు....

పై బొమ్మ కర్టేసి  ఈనాడు.

శక్తి దాస్ గారంటే  నెలవారీ  జీతం  తీసుకునే గుమాస్తా...
అయితే, దేశ భక్తులు ఊరుకుంటారా...
ఆ  నోటుని  చీల్చి చెండాడలేదుగానీ, 
ఉతికి ఉడకబెట్టి మరీ చూసి... అది  అబద్ధం అని  తేల్చారు...
ఈ  క్రింది లింకులు  నొక్కి మీరు తేల్చుకోండి...


నీళ్ళల్లో నానేసి  చూశారు...


ఉడకబెట్టి మరీ చూశారు...



దొంగ నోట్లు వచ్చాయని దానికో స్కేనర్ కనిపెట్టామని మరొకరు ప్రచారం చేశారు....
దానిప్రకారం 
ఆ  ఆప్  డవున్ లోడ్  చేసుకుని  
ఆ స్కేనర్  కెమెరా ముందు  రు .2000  నోటు  పెడితే 
మోదిగారి ప్రసంగం వస్తుంది....

స్కేనర్ పనిచేసే విధానం...

లింక్:
https://www.facebook.com/ramarao.bandi.90/videos/537482356458200/

ఆ ఆప్ బొమ్మ...
ఆప్ స్టోర్స్ లో   "MODI KEYNOTE" అని కొట్టి డౌన్ లోడ్  చేసుకోవాలి.

అవును అది నిజమే.
 అయితే, కాదు....
నాకు అనుమానం వచ్చి, 
కంప్యుటర్ మానిటర్  మీదకి రు.2000ల నోటు బొమ్మని తెప్పించి...
దానిమీద ఈ  స్కేనర్  పెట్టి  చూశాను...
వెంటనే వీడియో వస్తోంది....
అంటే, 
ఆ  ఆప్ లో  రు. 2000ల నోటు మీద ఉన్న బొమ్మలతో ఆక్టివేట్ అయి 
వీడియో వస్తోందన్నమాట....
అంటే, కలర్ ఫోటో స్టాట్  బొమ్మ  మీద  కూడా  వస్తుంది.
అది సంగతి.
రు. 2000 ల  నోట్  దగ్గర  లేని  వాళ్ళు  
ఈ  క్రింది  బొమ్మని  క్లిక్ చేసి  
పెద్దది  అయిన తరవాత దానిమీద  పెట్టి  చూడండి  వీడియో  వస్తుంది....
ఆ నోట్  స్కేన్ అవగానే  వీడియో  వచ్చేట్లు స్విచ్చింగ్ చేశారు...
నెట్ ఆఫ్  చేసినప్పుడు కూడా వస్తుంది.
మనకు డౌన్ లోడ్ అయిన ఆప్  లోనే  ఆ  వీడియో ఉంటుంది...

కర్టేసి: గూగుల్ బొమ్మలు.

కాబట్టి,  
ఈ  స్కేనర్ ఆప్ ని  నమ్మకండి.... 
ఇది  అసలు  నోటునే  కాక...
లర్ ఫొటో స్టాట్  కాపిని  చూసి  కూడా  నిజమే  అంటుంది...


సరే, అన్ని రకాల  పరీక్షలని తట్టుకున్న  ఈ  నోట్ల  మార్పిడి  వలన  
దేశం  మారిపోతుందా....
బ్లాక్ మని పోతుందా...
లంచగొండులు ఉండరా...అవినీతి ఉండదా....

కర్టేసి: ఫేస్  బుక్...

ఏమో  చెప్పలేము...
నోట్ల  మార్పిడికే అడ్డ  దారులు  వెదికే వారు  ఉండగా 
మారిపోతుందని  అనుకోవటం దురాశే...
అయితే,  
ఆశా  వాదం  అనేదే  దేనికైనా  మంచిది కదా...
ఎదో  మార్పు  వస్తుందని  మనం  ఆశించే ముందర  
మనం  ఎంతవరకు  మారామూ....మారబోతున్నామని  
అందరూ తమకి  తాము  ముందర  ప్రశ్నించుకుంటే... 
అప్పుడు మార్పు  వస్తుంది....
అలా కొద్దిగా  అయినా మార్పు  వస్తుందని  ఆశిద్దాం....

చివరిగా మోదిగారి చాలెంజ్ 
ఏది  ఏమైనా  ఎవరో  ఒకరు  చెయ్యాలి  కదా 
అది  మోడీ  గారు  చేశారు....
ఆయనకీ  అందరూ సహకరించాలి ...

చేసే దమ్ము  లేనప్పుడు  
చేసేవాళ్ళకి సహకరించాలి  కదా....


@@@@@@@@@@@@@@@@
జై హింద్ 
@@@@@@@@@@@@@@@@