LOCAL WEATHER

17, మే 2014, శనివారం

నిరంకుశం ఓడిపోయింది... ప్రజాసామ్యం గెలిచింది...!!!

ఈ సారి ఆంధ్రప్రదేశ్‌లో{23జిల్లాలు}జరిగిన ఎన్నికలని చూస్తే ప్రజాసామ్యమే గెలిచిందని గాఠిగా చెప్పలేకపోయినా... ఓడిపోయింది మాత్రం నిరంకుశ కాంగ్రెస్సే అని నిస్సందేహంగా చెప్పవచ్చును... అలా అని, ఇప్పుడు గెలిచిన ఏ పార్టీనో నెత్తికి ఎత్తుకోబోవటం లేదు... 

ముందరగా, సీమాంధ్రలో చూస్తే... కాంగ్రెస్సు దుర్గతి కన్నా అది ప్రజాసామ్యానికి చేసిన ద్రోహ ఫలితం ఏమిటో తెలుస్తుంది. ఇక్కడి ప్రజలలో అంతటి ఆగ్రహాన్ని కలిగించినది... కాంగ్రెస్సు వారి 10 ఏళ్ళ పరిపాలన కాదు...అలాంటివి క్షమించటం సీమాంధ్రులకి అలవాటే...అయితే విభజనే అని అనుకుంటున్నారా... కానే కాదు...మరింకేమిటీ...

కాంగ్రెస్సు రాష్ట్రాన్ని విభజన చేసిన విధానమే. అది పూర్తిగా ప్రజాసామ్యానికి వ్యతిరేకంగా ఉండటమే... ఏ వ్యవస్థ ఆధారంతో కాంగ్రెస్సు వారు అయిదేళ్ళకొకసారి అధికారాం పొందుతున్నారో ఆ వ్యవస్థనే వారు అపహాస్యంపాలు చేసేశారు. విభజన అనేది కొద్దిగా ఇబ్బందికరమైనప్పటికీ... ఎక్కువమంది ప్రజలు దానికి వ్యతిరేకం కాదు. పైగా "ఆ విభజనేదో 1972లోనే జరిగితే బాగుండేది కదా" అని విమర్శించినవారే ఎక్కువ. అలాంటి విభజనని పార్లమెంటుని సంతలాగా మార్చి సీమాంధ్రులని అవమానించి మరీ చేశారు.

విభజన జరిగిన రోజున కాంగ్రెస్సు కార్యాలయాలన్నిటినీ అగ్గెట్టేస్తారని చాలమంది అనుకున్నారు. ఆశ్చర్యంగా ఆ రోజునగానీ...తరవాత రోజుల్లో కానీ కాంగ్రెస్సు కార్యాలయాలకి పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదు... అదే "నిశ్శబ్ద ప్రజాసామ్య విప్లవానికి తెరలేపింది". ప్రజాసామ్యం అంటే గౌరవం లేనివారికి దౌర్జన్యంగా కనుక బుద్ధి చెపితే... బుద్ధి వచ్చే అవకాశం  లేదు...పైగా వారికీ వీరికీ తేడా ఉండదు కదా... అందుకనే ఎన్నికలలో "ప్రజాసామ్యయుతమైన దౌర్జన్యాన్ని కాంగ్రెస్సు మీద చూపించారు"... నాయకులూ లేరు... మంత్రులూ లేరు అందరినీ మట్టి కరిపించారు. 

కాంగ్రెస్సు వారు తెలంగాణావారి మన్ననలని పొందుదామనే క్రమంలో ప్రజాసామ్యం ద్వారానే మనం వచ్చాము... మనకి మిగిలిన దేశంలో కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా తెలుగువారు వెన్ను దట్టి నిలబెట్టారు అనే కృతజ్ఞతా భావం లేకుండా, ఏమి చేసినా పరవాలేదు అనే నిరంకుశ దురహంకారాన్ని ప్రదర్శించారు. దాని ఫలితంగానే "ఎప్పుడూ మేమున్నాము అని అక్కున చేర్చుకునే సీమాంధ్రులు... కాంగ్రెస్సుని నేలనేసి రాసేశారు". 

ఇక తెలంగాణా సంగతికొస్తే...సేమాధ్రులని తిడితే/అవమానిస్తే ఎక్కువ ఓట్లు తెలంగాణాలో పడతాయన్న కాంగ్రెస్సువారు అనుకున్నారు. ఇక్కడే పప్పులో కాదు... నిరంకుశంలో కాలేశేశారు... ఎంత తెలంగాణా వారికీ...సేమాంధ్ర వారికీ అబిప్రాయ భేదాలున్నా అంతా తెలుగువారే కదా... తెలంగాణా రావటం 10 జిల్లాలవారికి ఇష్టం అయినప్పటికీ; వచ్చిన విధానం ప్రజాసామ్యకంగా...గౌరవంగా లేకపోవటంతో, తెలంగాణా ప్రజల మన్నలని కాంగ్రెస్సువారు పొందలేకపొయారు.  తెలంగాణాని ఇచ్చింది కాంగ్రెస్సు వారే అయినప్పటికీ..."స్వంత సొమ్ముని దొంగతనం చెయ్యవలసిన ఖర్మేం పట్టింది" అని అనుకున్న తెలంగాణావారు, ఆ విషయాన్ని కాంగ్రెస్సుకి తమ ఓటు ద్వారా మెస్సేజ్‌ని పంపించారు.     

ఈ విధంగా ఎన్నికల ఎత్తులు కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాసామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్సు, రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది. కాంగ్రెస్సుకి మాత్రమే పడే ఓటింగు తెలంగాణాలో టీఆరెస్స్‌కి పడితే...సీమంధ్రలో ఓట్లు ఎక్కువ భాగం వైఎస్సార్సీపీకి పడినాయి.   ఈ వాత కాంగ్రెస్సుకి సహకరించిన బీజేపీకి కూడా పూర్తిగా పడేదే... కానీ, వారు లోకల్ వారి కాళ్ళు పట్టుకోవటంతో ముప్పు తప్పినా... దేశమంతా మోడీ హవా నడిస్తే...అది ఆంధ్రప్రదేశ్‌లో ఏమంత కనపడకుండా చెసేసింది.    

కాబట్టి, ఓ నేతలారా... ఇకనైనా బుద్ధి కలిగి, "ప్రజాసామ్యంతోనే మనం అధికారంలోనికి వస్తాము అన్న జ్ఞానాన్ని కలిగి, ప్రజాసామ్యాన్ని గౌరవిస్తూ, ప్రజాసామ్యయుతంగానే ఏ పనినైనా చేస్తు ఉంటే... కాంగ్రెస్సుకి నేడు ఆంధ్రప్రదేశ్‌లో పట్టిన గతి మరే పార్టీకీ పట్టదని" తెలుసుకోండి...  

అలాగే, ఒకరిని తిట్టి వేరోకరిని మంచి చేసుకుందాము అని తెలంగాణా,సీమాంధ్రలోని ఏ ఇతర పార్టీల నాయకులుగానీ వేరోకరుగానీ అనుకుంటే... వారిని తెలుగువారు ప్రజాసామ్యయుతంగానే చెంప దెబ్బ కొడతారని తెలుసుకొండి. ఇకనైనా ప్రజాసామ్యయుతమైన భాష వాడుతూ...తెలుగువారి అభివృద్ధి మీదే దృష్టి పెట్టండి. అదే మీ రాజకీయ భవిష్యత్తుకి మంచిది.



జై హింద్ 



బొమ్మలు గూగుల్ -మిక్సింగ్ కేఆర్కే 




రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:

లింకులు నొక్కండి



2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???




 17]సీమాధ్రులకి మరొ తన్నుడెనా....విశాఖపట్నం 

మరో హైదరాబాదు కాబోతున్నదా...???




@@@@@@@@@@@@



@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి