LOCAL WEATHER

5, ఫిబ్రవరి 2014, బుధవారం

చమ్మకాయ కూర

ఇవే "చమ్మకాయలు"... మా చిన్నప్పుడు మాయింట్లోనే వీటి పాదు ఉండేది...
వీటికి మరో ప్రాంతంలో ఏమైనా పేరుందేమో తెలియదు...

ఇవి మామూలు చిక్కుడుకాయలకన్నా చాలా పెద్దవిగా ఉంటాయి

చమ్మకాయలు అని ఇదివరలో బాగా వచ్చేవి... 
మాయింట్లో కూడా దీని తాలూకు పాదు ఉన్నట్లు జ్ఞాపకం. 
ఇవి చూడటానికి గోరు చిక్కుడులాగా ఉంటాయి. 
అయితే ఇవి గోరు చిక్కుడు...మామూలు చిక్కుడు కాయలకన్నా చాలా పెద్దవి... 
ఈ మ్మకాయలు దరిదాపుల కనుమరుగు అయిపోయినట్లే కనపడినా.... 
అప్పుడప్పుడు రైతు బజారులో దర్శనం ఇస్తున్నాయి. 
అయితే, 
చాలా మందికి వీటి పేరు కూడా తెలియకపోవటం వలన విచిత్రంగా చూస్తున్నారే కానీ..
కొనే ధైర్యం చెయ్యటంలేదు. 
అమ్మే వాళ్ళు కూడా ఇదోరకం పేద్ద చిక్కుళ్ళని చెపుతున్నారు.  
ఇలా ఎన్ని రకాలైన కూరగాయలు కాలగర్భంలో కలిసిపోతున్నాయో కదా...!!!

ఈ మధ్యన కూరగాయలు కొనటానికి వెళితే, మ్మకాయలు కనపడినాయి....
ఇవి కనపడటమే అరుదు...
కనపడిన తరవాత కూడా కొనకపోతే ఇంకా ఏమున్నది....
కొన్నాం సరే....
కూర వండుకొనే తినాలి కదా....


"చమ్మకాయ కూర" చేసే విధానం...

కావలిసినవి:

1] పావు కేజీ మ్మకాయలు[లకి]
2] పెసరపప్పు లేక కందిపప్పు చారెడు... 2 లేక 3 చెంచాలు
3] ఎండుమెరపకాయలు 4 
4] ఉప్పు తగినంత[చేత్తో వేస్తె మంచిది]
5]తిరగమోతకి కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, నూనె.... 
6] కర్వేపాకు  

ముందరగా... తెచ్చుకొన్న మ్మకాయాలని బాగా కడిగిన తరవాత... చిన్న చిన్న ముక్కలుగా తరుగుకోవాలి... ముక్కలుగా చేసే ముందర, కాయలకి ప్రక్కన ఉన్న భాగాన్ని...చిక్కుడుకాయలకి తీసినట్లే తియ్యాలి...ఎందుకంటే అక్కడ గట్టిపడ్డ పీచు ఉండి ఉండకదు. అందుకని దానిని తొలగించాలి. అయితే, చిక్కుడుకాయ చిన్నది కాబట్టి చేత్తోనే తీసేస్తాం... కానీ, మ్మకాయ పెద్దగా ఉండటం వలన కత్తిని వాడి తీస్తే గట్టి భాగం వస్తుంది. ఆలా తీసేసిన తరవాత, చిన్న చిన్న ముక్కల క్రింద తరగాలి... అప్పుడు బాగా ఉడుకుతుంది...

ఇదిగో ఇలాగ....ముక్కలు చెయ్యాలి

ఇప్పుడు ఇలా తరిగిన చమ్మకాయ ముక్కలని బూర్లెమూకుడులో వేసి దాని మీద పెసరపప్పు రెండు మూడు చెంచాలు వెయ్యాలి...అప్పుడు తగినంత ఉప్పు వేసి...అవి కొద్దిగా మునిగే వరకు నీళ్ళు పొయ్యాలి...

చమ్మకాయలు..పెసర పప్పు,ఉప్పు...క్రింద నీళ్ళతో...

అప్పుడు వాటీని ఉడికించాలి...బాగా ఉడికిన తరవాత, ఆ ముక్కలని ఒక చిల్లులు పళ్ళెంలో వెయ్యాలి... దీని వలన అందులో ఉన్న నీరు ఏమైనా ఉంటే పోతుంది.

పప్పు ఉప్పుతో కలిపి ఉడికిన చమ్మకాయ ముక్కలు

ఇప్పుడు బూర్లెమూకుడులో కొద్దిగా నునె వేసి, వేడెక్కిన తరవాత, అందులో ముందరగా ఎండుమెరపకాయల ముక్కలు, కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేయ్యాలి...ఇవి వేగిన తరవాత, స్టవ్వు మంటని బాగా తగ్గించి[సింలో]పెట్టి... కర్వేపాకును వెయ్యాలి...అప్పుడు ఇందులో ఉడకపెట్టిన మ్మకాయ ముక్కలని వేసి గరిటతో కలిపిదాని మీద మూతని మూడు నాలుగు నిమిషాలు పెట్టి ఉంచాలి. ఇలా మూత పెట్టటం వల్ల పోపుకు సంబంధించిన సువాసన కూరకి పడుతుంది. ఆ తరవాత, మూతని తీసేసి గరిటతో అటు ఇటు వేయించాలి. అలా ముక్కలలోని నీరు కొంత తగ్గే వరకు వేయించాలి. అంతే మ్మకాయకూర అయిపోయినట్లే...ఇక తినటమే తరువాయి... దీని రుచి మిగిలిన ఏ కూరలకీ తీసిపోదు...!!!

చమ్మకాయ కూర




ఇందులో ఇంతకు ముందు వచ్చినవి 
క్రింది లింకులు నొక్కండి:


కూరలు: 




పచ్చళ్ళు:





ఊరగాయలు:







@@@@@@@@@@@@@@@


























నా పుట్టిన రోజున FEBRUARY 3 న గూగుల్ లో వచ్చినది 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి