LOCAL WEATHER

25, అక్టోబర్ 2013, శుక్రవారం

ఆంధ్రప్రదేశ్‌లో తుఫానులు ఎక్కడా....??? {మీ వాతావరణం గురించి మీరే తెలుసుకోండి....}

సాధారణంగా మనం వాతావరణం గురించి ఇదివరలో రేడియో మీద ఆధారపడేవారం... ఇప్పుడు టివీల మీద ఆధారపడుతున్నాము. రేడియో వారు ఒక టైముకి వాతావరణం గురించి చెపితే...మన టివి వారికి వేళాపాళా లేదు... మనకున్న 15 ,  20 న్యూస్  చానళ్ళ వారికి... పోటి వచ్చిన విషయాలలో తప్పిస్తే వేరే దాని జోలికి పొయ్యే అలవాటు లేదు.... సామాన్యంగా వీరు రాజకీయ నాయకులకి ఇచ్చినంత ప్రాధాన్యం సామాన్య జనాలకి ఇవ్వరు... కాబట్టి మనకు "వాతావరణం" గురించి తెలియాలంటే అది రాజకీయ వాతావరణం తరవాతే చెప్తారు...ఒకవేళ చెప్పినా హైదరాబాదు "డబ్బాక్రింది చిలకల్లా"{*} అక్కడి[ హైదరాబాదు] వాతావరణం గురించి రాష్ట్ర ప్రజలందరికి చెపుతారు...లేదా పోటాపోటిగా చెప్పి జనాలనీ బెంబేలెత్తిచ్చేస్తారు....

కాబట్టి, వీరి మీద ఆధారపడకుండా... మనమే మన ప్రాంతపు వాతావరణం తెలుసుకోవాలంటే, ఈ క్రింది లింకు నొక్కండి...లేదా, క్రింది బొమ్మని నొక్కండి...[ఈ లింకుని బుక్ మార్క్స్ చేసుకొని ఎప్పటికప్పుడు వాతావరణం గురించి తెలుసుకోవచ్చును.]మనం ఏదన్నా ఊరు వెళుతున్నా... అక్కడి వాతావరణం కూడా తెలుసుకోవచ్చును.`

 వాతావరణం [లింకు నొక్కండి]

ప్రస్తుతం ఒక ఊపు ఊపుతున్న వర్షాల గురించి ఈ లింకులో చూపిస్తున్న వివరాలు ఈ క్రింది స్క్ర్రీన్ షాట్‌లో చూడండి.......బొమ్మని నొక్కండి....

కర్టేసి: accuweather.com

పైన లింకు నొక్కిన తరవాత మీకు ఎక్కడి ప్రాంతం కావాలంటే అక్కడి పేరు టైప్ చేస్తే కానీ, లేక స్క్రోల్ చేస్తే తెలుస్తుంది... లేదా మౌస్ రైట్ బట్టన్ నొక్కి మేప్‌ని మనకు కావాలిసిన ప్రదేశానికి తీసుకోని విషయం తెలుసుకోవచ్చును....దానిని డబల్ క్లిక్ ఇస్తే క్లోస్ అప్‌కి  వెళ్ళవచ్చును.


ఇప్పుడు[25-10-2013] [10-49AM] విజయవాడలో భిభత్సంగా వర్షం పడుతున్నది.


@@@@@@@@@@@@@@@@@@@@@@@@
{*}--    "డబ్బాక్రింది చిలకల్లా":ఇదొక చందమామ కధ.... 
దానిలో, చిలక చేత అబద్దపు సాక్షం చెప్పించటానికి...
ఆ చిలుక పంజరం మీద డబ్బా బోలించి..దాని మీద నీళ్ళు పోస్తూ ఉంటాడు...
పాపం అది ఊరంతా వర్షం కురిసింది అని అనుకుని...
సాక్షం చెప్పే టైములో అదే చెపుతుంది....
@@@@@@@@@@@@@@@@@@

ఇంతకు ముందు పోష్టులు

రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారు......???

రాష్ట్రాలా లేక శత్రు దేశాలా...???

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???



****    ****    ****    ****     ****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి