LOCAL WEATHER

25, డిసెంబర్ 2013, బుధవారం

సీతను వెదక... "రావణుని సహాయమడిగె"...కేజ్రీవాల్‌గారు....

one of the seven sins:
politics without principles
- గాంధి గారి యాంగ్ ఇండియాలో నుండి 

ఇదేదో సమస్యాపూరణం అనుకునేరు... కానే కాదు. కేవలం సమస్యలపై'రణం మాత్రమే... మన సమస్య కాదనుకోండీ... ఢిల్లీ వాసుల సమస్య పైన...

సీతను వెదికే క్రమంలో రాములవారు సుగ్రీవుడి సహాయం  తీసుకుంటారు. సుగ్రీవుని స్నేహం కోసం,  అతని అన్న వాలిని హతమారుస్తాడు రాముడు. అప్పుడు సుగ్రీవుడు తనవారి సహాయంతో సీతని వెదకటానికి ఒక్కోదిక్కుకీ కోందరిని పంపించి... చివరకి, హనుమంతుడు సహాయంతో సీత ఎక్కుడున్నదో కనుక్కుని, ఆవిడ కష్టాలు తీరటానికి సహాయపడతాడు.... ఈ కధంతా రామాయణంలో ఓ చిన్న భాగం. ఇందులో వెతికించేది సుగ్రీవుడైనా...పేరు హనుమంతులవారికే ఎక్కువ వచ్చింది... అయినా, ఇదొక విషయంగానైనా కూడా సుగ్రీవుడు గుర్తించనేలేదు...

కానీ, ధిల్లీ కధలో మన సుగ్రీవుణ్ణి సీత కష్టాలని తీర్చటానికి సహాయం అడిగితే... ఎవరు సహాయం ఎంతెంత చేస్తారో...వారేమి డిమాండు చేస్తారో...వారే ఈ క్రెడిట్టు అంతా కొట్టేస్తారేమోనన్న భయంతో... ఎవరో ఎందుకు డైరెక్టుగా రావణుని సహాయంపొందెస్తే పోలా అని.... తెలివిగా అనుకుని... రావణుని సహాయం పొందటానికి ముందడిగేశాడు... మనం సుగ్రీవుడనబడే కేజ్రీవాల్ గారు...!!! 

ఈ విషయంలో రాజకీయాలకి కొత్త అయిన ఆయన, తెలివితక్కువగా నిర్ణయం తీసుకున్నారని, చాలా మంది అనుకుంటున్నారు కానీ....కేజ్రీవాల్‌గారు రాజకియాలకి కొత్తేమోగానీ...అది తనకి కాదనీ...ఉన్న రాజకీయాలకే తనవంటివారు కొత్తని నిరూపించారు...ఇప్పటిదాకా జరుగుతున్న రాజకీయాలు తెల్లబోయేట్లుగా....  

శత్రువుకి శత్రువు మిత్రుడనీ, అలాంటివారందరూ కూడా కలిపి మిత్రులనీ శతాబ్దాలుగా అందరూ... ఇప్పటిదాకా భారత రాజకీయ వ్యవస్త నమ్ముతోంది.... రామాయణంలో వాలి తాను చనిపొయ్యేప్పుడు రాముని అడుగుతాడు..."అయ్యో నీకు సీతని వెదకటానికి సహాయం కావాలంటే అసమర్ధ సుగ్రీవుడే కావలిసి వచ్చాడా...నేను ఆ రావణునికన్నా బలవంతుడను...పైగా ఆ రావణుడు నాకు మిత్రుడు కూడా...నేను చెపితే వింటాడు కూడా" అని వాపోతాడు.... అప్పుడు రాముడు చెపుతాడు... "వాలీ... ఇది జరిగే పనే అయినప్పటికీ నీవు నాకు శత్రువువి... ఎందుకంటే...నాకు శత్రువైన రావణుడు నీకు మిత్రుడు కాబట్టి... నువ్వు నాకు శత్రువువి కాబట్టి... నీకు శతృవైన శుగ్రీవుడు నాకు మిత్రుడవుతాడు అసమర్ధుడైనప్పటికీ".... ఈ విధంగా వాలి సందేహం తీరుస్తారు రాములవారు.

ఇక కొత్త రాజకీయంలోనికి వస్తే, ఢిల్లీలో తమకి శత్రువైన కాంగ్రెస్సుని మట్టి కరిపించారు...ఆంఆద్మీ పార్టీ మరియూ బీజేపే పార్టీలు. అప్పుడు స్నేహ హస్తం చాచిన బీజేపీతో చెలిమి చేసి ప్రభుత్వ ఏర్పాటుని చెయ్యవచ్చును... సామాన్యంగా ఆ పొజిషన్‌లో ఏ పార్టీ ఉన్నప్పటికీ అదే చేసేవారు....బీజేపీని మతతత్త్వపార్టీ అన్నప్పటికీ... కానీ, ఇక్కడ ఉన్నది "రాజకీయాలకే కొత్త" అయిన కేజ్రివాల్ గారు.... ఇలా అనుకునే కాంగ్రెస్సు కూడా స్నేహ హస్తం ఇచ్చింది... తాము ఇదివరలో ఇతరులని ముంచినట్లుగా ఈ కొత్త పార్టీని కూడా ముంచేద్దామనే.... 

అయితే కెజ్రీవాల్ గారు ఇంకోలా ఆలోచించారు... తమకు శత్రువైన కాంగ్రెస్సుకి బలం తగ్గిపొయింది అనే దానికన్నా... తమ శత్రువుకి శత్రువుగా ఉన్న బీజేపేకి బలం పెరిగింది...అన్న విషయాన్నే ప్రాధాన్యతలోనికి తీసుకున్నారు మన ఆం ఆద్మి పార్టీ నేత. ఎలాగూ బలహీనపడిపోయిన శత్రువుతో ఇక భయం లేదు. అదే సమయంలో శత్రువు కన్నా బలంగా ఉన్న, మిత్రుడు కాని మిత్రుడుతో కలిసి పరిపాలన చేస్తే... ఆ వచ్చే మంచి పేరంతా ఆ పార్టీకే పోతుంది కదా.... "బలమైన మిత్రుడికన్నా, బలహీనమైన శత్రువు మేలన్న కొత్త రాజకీయానికి" తెర లేపారు... రాజకీయాలకే కొత్త అయిన కేజ్రీవాల్ గారు. 

మరి అంతా బాగున్నది అని అనుకుంటున్నా... కేజ్రీవాల్ గారు సిత ఎక్కడున్నదీ ఎలా కనిపడతారు? కష్టాలని ఎలా తీరుస్తారు...?? ఎందుకంటే, ఆవిడని ఎత్తుకొచ్చిన రావణుడే ఎక్కడున్నదీ...ఎలా ఎత్తుకొచ్చిందీ, ఎన్ని కష్టాలు పెట్టినదీ చెప్పడు కదా...ఎంత స్నేహం చేస్తున్నప్పటికీ... సరే, ఈ కొత్త సుగ్రీవుల వారు ఎలగొలా కనిపెటినప్పటికీ... దిల్లి వాసుల  కష్టాలకి కారణమైన రావణుని ఎలా శిక్షిస్తారు...ఈ క్రమంలో రాముడికి[కాంగ్రేస్సుకి వ్యతిరేకంగా ఓటు వేసిన ప్రజలకి]ఏమి సమాధానం చెపుతారు...  ఎంత "రావణుని సహాయమే తీసుకొమ్మని ఎస్స్.ఎమ్మ్.ఎస్స్ సలహాలు ప్రజల నుండీ వచ్చినట్లుగా కొత్త రాజకీయం నడిపినప్పటికీ"...ఈ కొత్త సుగ్రీవునికి కత్తి మీద సామే..... 

మొదటి ఎన్నికలలోనే కొత్త రికార్డులు నెలకొల్పి... కొత్త రాజకియ నాటకానికి తెరలేపిన  కొత్త పార్టీ కనుక కాంగ్రెస్సుని కట్టడి చెయ్యగలిగితే, దిల్లి వాసుల కష్టాలు తీరినట్లే... అప్పుడే కేజ్రివాల్ గారు నిజమైన సరికొత్త రికార్డుని నెలకొల్పినట్లవుతుంది......లేకపొతే ఏమున్నది...మళ్ళీ పాత రికార్డే[చరిత్రే]...కాంగ్రెస్సు కబళించిన మరొపార్టీగా ఆం ఆద్మీ పార్టీ చరిత్రలో కలిసిపోతుంది. 

MAN IS BY NATURE A POLITICAL ANIMAL - ARISTOTLE

ఏదిఏమైనా, మొదటి రాజకీయమే... తమ పార్టీ ఎదుగుదలకోసం ఇంత భీభత్సంగా నడిపి, అవినీతి పార్టీ అని తామే అన్న పార్టీతోనే జతకడితే... ఈ కొత్త పార్టీ "ఆంఆద్మీ పార్టీ ఎలా అవుతుందీ...అమ్యామ్య పార్టీ అవుతుందిగానీ"... అదికాక, కాంగ్రెస్సుతో రాజకీయాలంటే మాటలా...కాంగ్రెస్సుని తక్కువగా అంచనా వేసి, అది నిజంగా బలహీనపడింది అనిగానీ KEJRIVALగారు అనుకుంటే... ఆయన CRAZY WAIL గా మిగిలిపోవలసి  వస్తుంది.... 


ఇందులోని పాత్రలూ పాత్రధారులు షుమారుగా...

కొత్త సుగ్రీవుడు--- కేజ్రివాల్ గారు ... 
రాముడు---------  రావణునికి వ్యతిరేకంగా ఓటు వేసిన దిల్లి ప్రజలు... 
సీత---------------  రావణుని వలన కష్టాలు పాలైన దిల్లి ప్రజలు....         
కొత్త సుగ్రీవుడుచే రావణాసురుడుగా చెప్పబడిన పార్టి--  కాంగ్రెస్సు....
వాలి లేక ఆంజనేయుడా  అని[కేజ్రివాల్ గారి రాజకీయం వలన] చెప్పలేని పార్టీ--- బిజెపి ....





@@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@@@@@


ఇందులోని బొమ్మ...దానితోబాటు ఉన్న కొటేషన్స్ గూగుల్ వారివే 

21, డిసెంబర్ 2013, శనివారం

దేవయానిని అవమానించేది ఎవరు...???

అమెరికాలోని భారత్ కార్యాలయంలో డిప్యూటి కాన్సుల్ జనరల్‌గా పనిచేస్తున్నప్పుడు...ఒక పనిమనిషి విషయంలో తేడాగా ఉన్నందుకు దేవయానిగారిని అమెరికా వాళ్ళు అక్కడి చట్టాల ప్రకారం అరెస్టుచేశారు. ఆ సమయంలో వారు తప్పుగా ప్రవర్తించారు అని, గొడవ జరిగిన కొన్నాళ్ళకు భారత్‌లో ఆందోళనలు  చెలరేగినాయి. 



కర్టేసి:  సాక్షి... కధనం.

ఈ విషయంలో కేవలం అమెరికావాళ్ళనే తప్పుపట్టవలసిన పని లేదు..అన్ని యురోపియన్ దేశాల వైఖరి ఇలాగే ఉంటుంది. వారి అహంకారం అలాంటిది. ఆ అహంకారాన్ని మన దేశాల్లాంటివారు, ఇప్పటిదాకా ఎన్ని అవమానాలు జరిగినా కూడా ఆమోదిస్తూనే ఉన్నారు...అదే అసలైన తప్పు. యురోపియన్ దొంగలు భారతదేశంలో పట్టుబడితే...వారికి భారత చట్టాలు వర్తించవు....కానీ, సామాన్య తల్లిదండ్రులు తెలియక చేసిన చిన్న తప్పుకి, వారిని  యురోపియన్లు జైల్లో పడేస్తారు. పైగా వారి దేశాల చట్టాలని గౌరవించి తీరాలని అంటారు. 

అలా అన్న ఈ దొంగల దేశాలు, ఇతర దేశాల చట్టాలని... ముఖ్యంగా ఆసియన్,ఆఫ్రికన్ దేశాల చట్టాలని అసలు గౌరవిచటం మాట అటుంచి, కనీసం పరిగణలోనికి కూడా తీసుకోవు. మన వారి ఆవకాయాలని కూడా అక్కడికి రానియ్యరు కానీ, వారి బాంబులని మన దేశాలకి అమ్ముకుంటారు...ప్రమాదకర మందులని అమ్మేస్తారు... వారి దేశాలకి రావాలంటే మన వారికి అన్ని చెకప్పులూ చేస్తారు...అక్కడి ఎయిడ్స్ ఉన్న వారి ప్రజలు ఇక్కడికి వచ్చి మనదేశంలో విచ్చలవిడిగా తిరిగేస్తారు.... మన వారు పరిధి దాటి ఒక్క గంట ఉన్నా వారిని నేరస్తులని తరిమినట్లుగా తరిమి పట్టుకుంటారు... కాని, ఆ దేశస్తులు "మతం ముసుగులో" వేలు లక్షల మంది ఏ పర్మిషన్ లేకుండా మన దేశంలో గ్రామ గ్రామాన తిరిగేస్తారు....

కర్టేసి: ఈనాడు... కధనం 

ఈ విషయంలో కూడా ఈ దొంగల దేశాలని తప్పుపట్టవలసిన పనిలేదు. ఎందుకంటే వారి అహంకారాన్ని మిగిలిన దేశాలవారు ఆమోదించటమే కారణం.... ఇవే కాదు, ఆసియాలోనే ఉన్న అరబిక్ చట్టాలూ కూడా ఇలానే ఉంటాయి. వారు మన దేశానికి వచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించ వచ్చును; చిన్న పిల్లలను పెళ్ళిళ్ళు చేసుకోవచ్చును... కాని మన వాళ్ళు అక్కడికి పొతే, అక్కడి చట్టాలకి లోబడి ఉండవలసిందే...చివరికి మన మాజీ రాష్ట్రపతి శంకరదయాల్ గారి భార్య కూడా బురఖా ధరించవలసి వచ్చింది. మరి అలాంటప్పుడు షేకులు మన దేశానికి వచ్చినప్పుడు "వారి భార్యలు పట్టుచీర కట్టుకొని బొట్టు పెట్టుకుని ఉండాలి" అని మనవాళ్ళు అడగకపోవటమే మనవారి తప్పు....

ఇలా ఒక దేశం మరొక దేశాన్ని అవమానిస్తున్నప్పుడు, ఒకరి దౌత్యవేత్తలని మరొకరు అరెష్టు చెయ్యటమో లేక దేశం నుండి తరిమేయ్యటమో ఇదివరలో జరిగేది. ఇతర దేశాల్లో జరుగుతోంది కూడా... కానీ, మన దేశంలో ఉన్న దిక్కుమాలిన నీతి జాతి లేని రాజకీయ వ్యవస్థ వలన మన దేశం పౌరులు... బయట దేశాల్లోనే కాదు, మనదేశంలో కూడా ఏ నేరం చెయ్యకుండానే అవమానాల పాలవుతున్నారు. ఈ పరిస్థితికి ... మన దేశ రాజకీయ నాయకులకి దేశమంటే గౌరవం లేకపోవటమే ముఖ్య కారణం . ప్రతివారికి వారి వారి వ్యాపారాలే ముఖ్యం కాని...ప్రజల మానాలు ప్రాణాలు కాదు.  వారి వ్యాపారాలకోసం కోసం ఏ దేశానికైనా దాసోహం అనేస్తున్నారు....మన ఆర్ధిక దుస్తితికన్నా యూరప్పుల ఆర్ధిక ఆరోగ్యమే మన దేశనాయకులకి  ముఖ్యం...

వీరికి తోడూ... మన మీడియా వారు...ముఖ్యంగా టీవీల వారు...ప్రింటు మీడియాలో జరిగినది జాగ్రత్తగా మర్యాదగా వ్రాస్తుంటే...టీవీ 9 లాంటి మూర్ఖ ఛానళ్ళు ఇష్టారాజ్య భావజాలం వాడుతో.... అమెరికాలో దేవయానిగారికి ఒకసారి అవమానం జరిగితే, దానిని తిప్పి తిప్పి ఇష్టానుసారం మార్చివేసి అసభ్యంగా చిత్రీకరించి, తెలియని అందరికి తెలిసేట్లుగా చేస్తున్నారు...అదేదో సినిమాలో బ్రహ్మానందం మరియు ఎవిఎస్స్ గార్ల మధ్య జరిగిన విపరీత హాస్యం లాగా మన టివి వారు ప్రవర్తిస్తున్నారు...

కర్టేసి: యుట్యుబ్... ప్రియరాగాలు సినిమా నుండి 

ఇందులో బ్రహ్మానందం గారు ఎవిఎస్స్ గారిని శిక్షించినట్లుగా  
టీవీవారిని కూడా  శిక్షించినా ...ఎవిఎస్స్ గారి రియాక్షనే రావచ్చును...

కాబట్టి, మన భారతదేశ వనితకి గౌరవం కలగాలంటే ముందరగా టీవీవారు సంయమనం పాటించి, సరైన భావజాలాన్ని వాడుతో విషయాన్ని ప్రజలకి తెలియజెయ్యాలి.  అమెరికా మీద కోపంతో, అవతల ఉన్నది భారతీయ వనిత అన్న సంగతి మరచి... అందరు విపరీత ప్రవర్తన చేస్తున్నారు; అది ముందర మానుకుంటే మంచిది. అమెరికా వాళ్ళ అవమానం కంటే మనవాళ్ళ  విపరీత ప్రవర్తన.... ముఖ్యంగా దిక్కుమాలిన టివీల "నోటివాపిరి జాలం" మారితే... దేవయాని గారికి మరింత అవమానం జరగకుండా ఉంటుంది.

చివరిగా, ఎదో జరిగినప్పుడు అల్లరి చేసి, తరవాత మిన్నుకుండిపోవటం మానుకొని... ఒక నిర్దుష్టమైన విధానంతో భారత రాజకీయ వ్యవస్థ ఉండాలి. మొన్న  భోపాల్ గేస్ నిందితుడిని దగ్గరుండి మరీ విమానం ఎక్కించారు.... నిన్న ఆయుధాల జారివేత కేసులోని రష్యాన్ని ఒదిలేసారు....ఈ మధ్య ఇటలివారి పట్ల ఉదాశీనంగా ఉన్నారు... ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో...మరెన్నో  మన వారి తప్పిదనాలు... మన చట్టాన్ని మనమే గౌరవించకపోతే దొంగ యురోపియన్ దేశాలు ఎలా గౌరవిస్తాయి...ఇప్పటికైనా  ఈ విషయాన్ని కఠినంగా తీసుకోని అమెరికాకి తగిన గుణపాఠం నేర్పి...దీనితోపాటు  ఇతర దేశాల పౌరులు ఎదో దేవతలైనట్లు వారి నేరాల పట్ల ఉదాసినంగా ఉండకుండా తగిన విధంగా మన చట్టాన్ని అనుసరిస్తే... అది మిగిలిన అన్ని దేశాలకి... ముఖ్యంగా యూరప్పు దేశాలకి హెచ్చరికగా ఉంటుంది....



జై హింద్ 






28, నవంబర్ 2013, గురువారం

మునిగిపోయిన లెహర్ తుఫాను

మునిగిపోయిన లెహర్ తుఫాను

తీరాన్ని ఎక్కక ముందే బలహినపడిపోయింది.

మచిలీపట్టణం వద్దకు వచ్చేప్పటికే  సముద్రంలోనే బలహిన-పడిపోయింది.

దీనివలన తుఫాను ప్రమాదం లేకపోయినప్పటికీ

భారి వర్షాలు పడతాయని అంటున్నారు.

అయితే, దీని పరిస్థితి చూస్తే ఆమాత్రం కూడా జరిగే అవకాశం కనపడటం లేదు.

అయితే, తుఫాను తీవ్రత తగ్గినప్పటికి

నర్సాపురం/మచిలీపట్టణం తీరప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండటం మంచిది.

ఈ విధంగా

నూటొక్క  గంటల

లెహర్ తుఫాను ప్రయాణ గాధ విషాదాంతంగా మునిగిపోయినా

కోస్తా ప్రజల కధ సుఖాంతం అయ్యింది.


నిన్న రాత్రి 9.25  ఈ రోజు ఉదయం 6.25 వరకు తుఫాను కదలికలు...
బలహీనపడిన తుఫాను మచిలీపట్టణం-నర్సాపురం దగ్గర తీరాన్ని దాటే దృశ్యం  



లెహర్ తుఫాను మొదలు నుండి చివరిదాకా నడిచిన దారి 
23-11-2013 సాయంత్రం 4.25 నుండి 28-11-2013 ఉదయం 7.25 వరకు 
ఊహా చిత్రం కాదు. సేటిలైట్ గంట గంటకి తీసిన ఫోటోల GIF .

లేహర్ తుఫాను ప్రయాణంలో  రెండు టర్నింగు పాయింట్లు...

ఒకటి అండమాన్ దగ్గర దాటుతున్నప్పుడు 

NORTH-WEST నుండి WESTకు దిశ మారటం,

రెండవది చెన్నయి వైపుకి వస్తు NORTH-WESTకు దారి మళ్ళటం.

బహుశా తీరం దగ్గర నీళ్ళు-గాలి NORTH దిశగా కదులుతూ ఉండి ఉండవచ్చును.

రెండవ  టర్నింగు పాయింటు దగ్గరే తుఫాను బలహినపడింది.

*******************

కొసమెరుపు ఏమంటే, ఈ తుఫాను తీవ్రంగా వస్తున్నప్పుడు 

రకరకాలైన భయంకరమైన మ్యూజిక్కులు పెట్టి... భయపెట్టిన మన మీడియావారు, 

ఈ తుఫాను బలహినపడగానే మతిమరుపు నటించి, 

యధావిధిగా దిక్కుమాలిన విభజన పురాణాన్ని మాత్రమే

ప్రజల నెత్తిన రుద్దారు.

మనం తుఫాను గురించి ప్రజలని భయపెట్టాము,

తిరిగి మనమే ఆ భయాన్ని తొలగించాలి అన్న 

కనీస సామాజిక బాధ్యతని మరచారు.
  


@@@@@@@@@@@@
తుఫాను గురించి నిన్న వేసినది 
లింకు నొక్కండి 
@@@@@@@@@@@@ 


కర్టేసి: accuweather.com.......gdacs.org ......skymetweather.com 

@@@@@@@@@@@@

భయంకరమైన తుఫాను తప్పిపోయింది 
 హాయిగా చల్లగా ఉన్నది...కొద్దిగా వర్షం పడుతోంది.
ఇప్పుడు ప్రశాంతమైన కిషోర్ కుమార్ పాట వినండి.

Ruk jana nahi tu kahin haar ke


కర్టేసి యు ట్యూబ్ 







27, నవంబర్ 2013, బుధవారం

ముందుకి దూకుతున్న "లెహర్" తుఫాను...

23-11-2013న ACCUWEATHER.COMలో పేరు పెట్టక ముందే ఉంచిన లెహర్ తుఫాను ఊహా చిత్రం.

మరొక సైట్  gdacs.org లో పెట్టిన లెహర్ తుఫాను ఊహా చిత్రం 


 లెహర్  పుట్టిన దగ్గర నుండి ఇప్పటి దాకా
[FROM 23-11-2013 సాయంత్రం 4.25 నుండి  27-11-2013 ఉదయం 6.25 వరకు]
 accuweather.com వారు పెట్టిన సేటిలైట్ చిత్రాలని Gif చేసి పెట్టాను. ఈ క్రింద చూడండి.
ఇది ఊహా చిత్రం కాదు...
23 సాయంత్రం 4.25నుండి ఈ రోజు ఉదయం 6.25 వరకూ గంట గంటకి 
 సేటిలైట్ తీసిన ఫోటోల సమాహారం


skymetweather.com లో ఇచ్చిన వాతారావరణ హెచ్చరికను 
ఈ లింకు నొక్కి   
చూడండి.

వీరి ప్రకారం 
ఇవ్వాళా రేపట్లో 
కాకినాడా-విశాఖపట్టణం మధ్య 
లెహర్ తుఫాను 
దాటే అవకాశం ఉన్నది.

వీరు చెప్పినట్లే ఈ లెహర్ తుఫాను అదే స్పీడులో తగిలితే 
చాలా నష్టం జరిగే అవకాశం ఉన్నది. 
ఈ సందర్భంలో కేవలం కాకినాడ ప్రాంతమే కాకుండా, 
నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది.  ఎందుకంటే...ఇప్పటిదాకా పైన ఉన్న ఊహాచిత్రాల ప్రకారమే లెహర్ తుఫాను నడిచినా....
తీరం దగ్గరపడేప్పటికి అది సరిగ్గా ఎక్కడ ఎక్కుతుందో చెప్పటం కష్టం.... 
ప్రకృతి విపత్తులు వస్తున్నప్పుడు... 
క్కువ నష్టం కలగకూడదని దేవుణ్ణి ప్రార్ధించటంతో పాటు 
సంయమనంతో వ్యవహరించి, అధికారులకి సహకరిస్తే 
ప్రాణనష్టాన్నైనా తగ్గించే అవకాశం ఉన్నది.

@@@@@@@@@@@@

27-11-2013 సాయంత్రం 5 గంటలు 

ఈ లెహర్ తుఫాను అండమాన్ మీదుగా దాటినప్పుడే తన దిశ మార్చుకున్నట్లుగా  కనపడుతోంది. 
ఇది మొన్న 25 రాత్రి నుండే కనపడినప్పటికి, ఇవాళ మధ్యాన్నం వరకు ఏ శాఖవారు గుర్తించలేదు. 
ఇది అక్కడి వరకు NORTH-WESTగా ప్రయాణించినా, అండమాన్ దాటినా తరవాత కేవలం WEST వైపునకే ప్రయాణం మొదలు పెట్టినది.
బహుశా 
ఇది చెన్నయి-నెల్లూరు వైపుకి 
బయలుదేరినట్లు కనపడుతోంది.

25వ తారీకు రాత్రి 9.25 నుండి 27వ తారీకు సాయంత్రం 4.25 వరకు 
మోన్న రాత్రి నుండి ఇప్పటి వరకు WEST దిక్కుగా  లేహర్ తుఫాను కదలిక.....



@@@@@@@@@@@@

27-11-2013 రాత్రి  11 గంటలు

లెహర్ తుఫాను మధ్యాహ్నం 3 గంటలు వరకు WEST కు ప్రయాణం చేసి 
తరవాత NORTH దిక్కుకి కదలటం మొదలెట్టింది.
ఈ క్రమంలో తుఫాను యొక్క శక్తి తగ్గినా, తిరిగి కొంత పుంజుకొని 
 NORTH మరియూ NORTH-WEST కు ప్రయాణిస్తూ 
 కాకినాడకి, మచిలీపట్టణానికి మధ్య  ఉన్న 
కోనసీమ నర్సాపురం-అమలాపురం  
వద్ద దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నది.

ఈ రోజు మధ్యాహ్నం 2.25 నుండి రాత్రి 10.25 వరకు తుఫాను కదలికలు...
తుఫాను NORTH-WEST దిక్కుగా కదలటం  చూడవచ్చును.


    @@@@@@@@@@@@

28-11-2013 ఉదయం 7 గంటలు

మునిగిపోయిన లేహర్ తుఫాను

తీరాన్ని ఎక్కక ముందే బలహినపడిపోయింది.
మచిలీపట్టణం వద్ద సముద్రంలోనే బలహిన-పడిపోయింది.
 దీనివలన తుఫాను ప్రమాదం లేకపోయినప్పటికీ
భారి వర్షాలు పడతాయని అంటున్నారు.
అయితే, దీని పరిస్థితి చూస్తే ఆమాత్రం కూడా జరిగే అవకాశం కనపడటం లేదు.
ఈ విధంగా
నూటొక్క  గంటల 
లెహర్ తుఫాను ప్రయాణ గాధ విషాదాంతంగా మునిగిపోయినా
కోస్తా ప్రజల కధ సుఖాంతం అయ్యింది.

నిన్న రాత్రి 9.25  ఈ రోజు ఉదయం 6.25 వరకు తుఫాను కదలికలు...
బలహీనపడిన తుఫాను మచిలీపట్టణం-నర్సాపురం దగ్గర తీరాన్ని దాటే దృశ్యం  



@@@@@@@@@@@@

కొసమెరుపు ఏమంటే, ఈ తుఫాను తీవ్రంగా వస్తున్నప్పుడు 
రకరకాలైన భయంకరమైన ముజిక్కులు పెట్టి భయపెట్టిన మన మీడియావారు, 
ఈ తుఫాను బలహినపడగానే మతిమరుపు నటించి, 
యధావిధిగా దిక్కుమాలిన విభజన పురాణాన్ని మాత్రమే
ప్రజల నెత్తిన రుద్దారు.
మనం తుఫాను గురించి ప్రజలని భయపెట్టాము,
తిరిగి మనమే ఆ భయాన్ని తొలగించాలి అన్న 
కనీస సామాజిక బాధ్యతని మరచారు.
  
@@@@@@@@@@@@

మునిగిపోయిన లేహర్ తుఫాను

@@@@@@@@@@@@



కర్టేసి: accuweather.com.......gdacs.org ......skymetweather.com 





24, నవంబర్ 2013, ఆదివారం

నేతిబీరకాయ పచ్చడి...


బీరకాయలాగా ఉంటుందనే కానీ... దీనికి బీరకాయకి అసలు సబంధమే లేదు. 
అలాగే, పేరులో నెయ్యి ఉన్నప్పటికీ, నేతితో సంబంధం లేకపోయినప్పటికీ... 
ఈ కాయలతో పచ్చడి చేసుకుని తింటే, నెయ్యంత రుచిగా ఉంటుంది. 
బహుశా అందుకే నేతిబీరకాయ అని పేరు పెట్టారేమో.....


ఇది పాదు. అంటే తీగాలాగా పాకేది.  
సామాన్యంగా కార్తీకమాసంలోనే నేతిబీరకాయలు వస్తాయి. 
ఈ కాయలు కార్తీకమాసంలో తింటే చాలా పుణ్యం అని చెపుతారు.... 
ఈ కాలంలో మాత్రమే దొరికే నేతిబీరకాయలు తింటే
ఈ కాయలలోని పీచు గుణాలు ఆరోగ్యానికి మంచిది
అని ఉద్దేశ్యం అయి ఉంటుంది. 
మాములుగా తినమంటే మనవారికి సరిపడదు కదా... 
పుణ్యమో పురుషార్ధమో అంటే తప్ప....!!! 
పైగా  ఈ పాదులనే పెంచకపోవచ్చును...


ఈ నేతిబీరకాయాలలో పీచు ఎక్కువ ఉండటం వలన  పచ్చడికే ఉపయోగిస్తారు... 
ఈ పచ్చడిని రెండు రకాలుగా చెయ్యవచ్చును. 
ఒకటి...కాయని ముక్కలుగా కోసి, వాటిని వేయించి పచ్చడి చెయ్యటం.  
రెండవది... మరియూ పాతకాలం పద్దతి ప్రకారం 
కాయని పొయ్యి మీద కాల్చి పచ్చడి చెయ్యటం.

1. నేతిబీరకాయ ముక్కలు పచ్చడి.

కావాలిసినవి

1.నేతిబీరకాయ ఒకటి
2.చింతపండు కొద్దిగా 
3.నూనె కొద్దిగా
4.పచ్చిమెరపకాయలు 6 లేక 8 [నేతి బీరకాయ సైజుకి తగినన్ని]
5.కొత్తిమీర ఒక కట్టలో సగం 
6.తగినంత ఉప్పు [ఉప్పుని ఎందులో వేసేప్పుడైనా చెంచాలు వాడకుండా చేత్తో వేస్తె మంచిది. చేత్తో వేస్తే కనుక, మనకి తెలియకుండా ఉన్న శక్తి వలన తగినంత ఉప్పే వేస్తాము.]


చేసే విధానం:


ముందుగా కొద్ది నూనెను మూకుడులో వేసి వేడి చేసి... దానిలో తరిగిన నేతిబీరకాయ ముక్కలని వెయ్యాలి. అయితే, ముక్కలు వేగకూడదు...ఉడకాలి. కాబట్టి, అవి వేగకుండా ఉండటానికి, మూకుడు పైన మూత పెట్టాలి. అవి కొద్దిగా ఉడకగానే, దానిలో కొంచం చింతపండుని వేసి కలిపి, తిరిగి ముక్కలు బాగా మెత్తబడేవరకు ఉడకబెట్టాలి. 


ఇప్పుడు,  పచ్చిమెరపకాయాలని  మిక్సీలో వేసి...అవి నలిగినా తరవాత, 
దానిలోనే ఉడికిన నేతిబీరకాయ ముక్కలని వేసి మిక్సీని కొద్ది కొద్దిగా తిప్పాలి.  
మిక్సీని పూర్తిగా తిప్పితే
 మొత్తం ముక్కలు కనపడకుండా రసంలాగా చూర్ణం అయ్యే ప్రమాదం ఉన్నది. 
ఈ  పచ్చడిలో సన్నగా తరిగిన కొత్తిమీర కలుపుకోవాలి. 
అంతే నేతిబీరకాయ ముక్కల  పచ్చడి తయారైనట్లే.....
ఇక అన్నంలో కలుపుకొని తినటమే తరువాయి......




2. నేతిబీరకాయ కాల్చిన పచ్చడి.


కావాలిసినవి:

1.నేతిబీరకాయ ఒకటి
2.ఎండు మెరపకాయలు 8 [నేతిబీరకాయ కాయ సైజునిబట్టి] 
3.నూనె మూడు చెంచాలు 
4.మినపప్పు ఒక చెంచా 
5.ఆవాలు, జీలకర్ర కొంచం 
6.ఇంగువ కొద్దిగా, తగినంత ఉప్పు [ఉప్పుని ఎందులో వేసేప్పుడైనా చెంచాలు వాడకుండా చేత్తో వేస్తె మంచిది. చేత్తో వేస్తే కనుక, మనకి తెలియకుండా ఉన్న శక్తి వలన తగినంత ఉప్పే వేస్తాము.]       


చేసే విధానం:



ముందుగా నేతిబీరకాయ పైన నూనెను రాసి దానిని స్టవ్వు మీద కాల్చాలి.
 తిప్పుతూ అది అన్ని వైపులా తగిన విధంగా కాలేట్టుగా  చూసుకోవాలి. 
 అది బాగా కాలినా తరవాత, చల్లారే వరకు ఆగి, దానిమీద ఉన్న చెక్కును తీసివెయ్యాలి.
  ఈ కాయలో పీచు ఎక్కువ కాబట్టి,  క్రింద ఒక గిన్నె పెట్టుకొని, 
కాలిన నేతిబీరకాయ  తలకాయ భాగాన్ని పట్టుకొని క్రింద వరకు నొక్కుతూపోవాలి. 
అప్పుడు ఆ కాయలోని గుజ్జు మరియు గింజలు ఆన్ని క్రింద పెట్టిన గిన్నేలోనికి వస్తాయి.
 చేతిలో మిగిలిన పీచులో మెత్తటి భాగాన్ని కూడా గిన్నేలోనికి వేసుకోవాలి. 


ఇప్పుడు,   ఆవాలు, జీలకర్రా ఎండు మెరపకాయాలలో కొద్దిగా ఇంగువ వేసి  వేయించాలి.
 ఈ వేయించిన వాటిని మిక్సీలో వేసి తిప్పిన అనంతరం, 
దానిలో నేతిబీరకాయ గుజ్జుని కూడా కలిపి మరొకసారి కొద్దిగా మిక్సీని తిప్పాలి.
 అంతే... కాల్చిన నేతిబీరకాయ పచ్చడి తయ్యారైనట్లే......



ఈ నేతిబీరకాయ చట్నిలని అన్నంలో కలుపుకుని తినటమే కాదు,  
దోశలలో నలుచుకుని తిన్నా బాగుంటాయి.



@@@@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@@@@
@@@@@@@@@@@@@