LOCAL WEATHER

26, సెప్టెంబర్ 2012, బుధవారం

"చైనా కార్మికుల్లారా మేల్కోండి"




 
ప్రపంచ దేశాలలో ప్రజలని పరిపాలించటానికి అక్కడ ఏవిధమైన పద్ధతి ఉన్నప్పటికీ, ఆ పద్ధతిలో లోపాలుంటే ఆ దేశ ప్రజలు సహించరు. ప్రజలు తమను సరిగా చూసుకొనే ప్రభుత్వాలనే ఆదరిస్తారు. లేదూ ప్రజలు దొరికారు కదా అని ప్రభుత్వాలు తోక జాడిస్తే ఫ్రాన్సు, రష్యా, ఈజిప్టూ సౌత్ ఆఫ్రికా మొదలైన దేశాధినేతలకి పట్టిన గతే పడుతుంది.

ఇప్పటిదాకా ప్రపంచాధిపత్యం చేద్దామన్న ఏ దేశానికీ ఆ దేశ ప్రజలు సంపూర్ణమైన మద్దతు పలకలేదు. ప్రజల గోడు పట్టించుకోకుండా స్వంత ప్రజల శ్రామిక శక్తిని దోచుకొనీ,  వారి దారిన వారు ప్రపంచాన్ని ఎలా గుప్పిట పెట్టుకోవాలీ అనీ చూస్తే, స్వంత ప్రజలే తిరగ బడతారు.  అలా కుదరనప్పుడు ఆ దేశాలు క్రమంగా బలహీన పడతాయి.

రష్యాలో అదే జరిగింది, అమెరికాలో అదే జరుగుతోంది....చైనాలో అదే జరగబోతోందా .......?  చైనాకి కూడా రష్యా , అమెరికా గతే పట్టబోతొందా.....?


ఎందుకంటే దీనికి ముఖ్య  కారణం తమ ప్రయోజనాల కోసం స్వంత ప్రజలని పావులుగా పెట్టి వారి శ్రామిక శక్తినీ,   దేశ  సంపదనూ వాడుకొని  తద్వారా ప్రపంచాన్ని గుప్పిటపెట్టుకోవాలను చుడటమే.... ఈ విధంగా చేసే కొన్ని యూరప్ దేశాలూ,  రష్యా మరియూ అమెరికాలు తమకేమాత్రం సంబంధం లేని విషయాలలో తల దూర్చి తమ ఎకానమీలను[ప్రజల శక్తిని] బలహీన పర్చుకొన్నాయి. ఇప్పుడు అదే దారిలో చైనా ఉన్నది.   

యూరప్ దేశాలకంటే చైనా కొంచం అతి తెలివిని ప్రదర్శిస్తోంది.  యూరప్ దేశాల వారు తమ ప్రజలని పరోక్షంగా వాడుకొంటే చైనా ప్రత్యక్షంగా వాడుకొంటొంది.  ఇందులో భాగమే అతి తక్కువ ధరలకి అనేక వస్తువులను ప్రపంచానికి అందించటం...... డిఫ్లేషన్ అనేది ఇంఫ్లేషను కన్నా ప్రమాద కరమైనది.  దీని వలన నిరుద్యగిత పెరిగిపోతుంది. అందుకనే తన శ్రామికులను ఉపయోగించి మిగిలిన దేశాల పరిశ్రమలను దెబ్బతీసి......దాని ద్వారా ఆయా దేశాల ఎకానమీలను దెబ్బతియ్యాలని చైనా ప్రయత్నం.   
 

ప్రపంచ కార్మికుల  సంగతి సరే, మరి చైనా కార్మికుల మాటేమిటి........??? కారల్ మార్క్స్ సిద్దంతం ప్రకారం ప్రపంచంలో ఏ వస్తువుకూ స్వంత పూర్తి విలువ ఉండదు. దానికి శ్రామిక శక్తిని జోడించిన తరవాతే దేనికైనా పూర్తి విలువ పుడుతుంది. దీని ప్రకారం ఒక దేశంలో దొరికే వస్తువు విలువ బట్టి, ఆ దేశంలో శ్రామికునికి ఇచ్చే విలువ తెలుస్తుంది.  ప్రపంచంలో ఒకే వస్తువుకు అనేక దేశాలలో అనేక ధరలుంటాయి. ఇలా ఉండటానికి అనేక కారణాలుంటాయి....మొదటిది ఆ దేశపు డబ్బు మారకం విలువ.......ఆ దేశంలో వస్తువుకు కావాల్సిన ముడి సరుకు దొరకక పోవటం.....ప్రతీ వస్తువూ అన్ని దేశాలలో అందుబాటులో లేకపోటం.....ఆ వస్తువు తయారీలో నైపుణ్యంలో తేడాలుండటం......ఇలా మొదలైన కారణాలుండటం వలన ఏ దేశం కూడా అన్ని వస్తువులనూ అందుబాటులో ఇవ్వటం కష్టమే మరి.

కానీ, చైనా విషయంలో వేరే విధంగా ఉన్నది. అన్నిరకాలైన వస్తువులనూ మరొక దేశంలోని ఏ కార్మికుడూ తయారు చెయ్యలేనంత తక్కువ  ధరకు ఇస్తున్నారు. ఇదెలాగు సాధ్యమైనది....? పోనీ చీనాలో తక్కువ ధరలకే బ్రతికే విధంగా ఉన్నదా.....???
అలాంటప్పుడు ఆ దేశపు కరెన్సీనీ ఆధారంగా చేసుకొని చూడాలి....చైనా దేశపు కరెన్సీ "యవాన్" మన దేశపు "రూపాయి" కంటే  షుమారు 8.35 రెట్లు ఎక్కువ.....అనగా మన దేశంలో శ్రామికుడికి ఇచ్చేదానీకన్నా ఎంత లేదన్నా కనీసం 8.7  రెట్లు అధికంగా విలువ ఇవ్వాలి. అలాంటప్పుడు చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువు మన దేశంలో దొరికే వస్తువు కన్నా 8.35 రెట్లు అధికంగా ఉండాలి. అలాగే,  అమెరికన్ డాలర్‌తో పోలిస్తే కేవలం 6.9 యువాన్లకే ఒక డాలరు వస్తుంది.   అంటే అమెరికా కన్నా తక్కువ, మరియూ మన కన్నా ఎక్కువ జీవన విధానం చైనాలో ఉన్నట్లు అనుకోవాలి.  అలాంటప్పుడు మనదేశం కన్నా తక్కువ ధరకు [మనకు పంపించేంతగా]   ఇవ్వటం  ప్రకారం చూస్తే....... అన్ని వస్తువులూ   తయారు  చేసే  ముడిసరుకు అతి చవుకగా  చైనాలో అందుబాట్లో  ఉన్నదనుకోవాలి.. .......లేదా  వారి శ్రామికుల శక్తిని తక్కువగా కొలవాలి.  మొదటిది అసాధ్యం కనుక,  రెండవదే చైనా చేపట్టింది.  

 
ఈ విధంగా తనకున్నా జనభానీ ఒక ఆయుధంగా చేసి ప్రపంచం మీదకు సంధిస్థొంది. కానీ ఆ ఆయుధం మనుషులని గుర్తించటంలేదు. ఇది అణుయుద్ధం కన్నా, క్రిమి రసాయనిక యుద్ధాల కన్నా నికృష్టమైనది....ఇది ఏ రెండు దేశాల మధ్యా జరిగే యుద్ధం కాదు........
ప్రపంచంలోని అనేక దేశాల  కార్మికుల మీద  యుద్ధం.  చైనా తన కార్మికులని వచించి, ప్రపంచ కార్మికుల పొట్టగొడుతున్నది. "ప్రపంచ కార్మికులారా ఏకంకండి" అని కమ్యూనిజం చెపుతుంటే అదే సిద్ధాంతాన్ని దురుపయోగ పరచి ప్రపంచ కార్మికుల మధ్య విభేదాలు తెస్తోంది. ఈ విధంగా ప్రపంచ చరిత్రలో ఏ నియంత చెయ్యనంత నికృష్ట విధానంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. 

ఇవ్వాళ చైనాలో కనపడేది మూలంలో ఉన్న  కమ్యూనిజం  కాదు...."మార్పు" అనే పేరుతో మూలాన్నే మార్చేసి "బూర్జువా 
కమ్యూనిజం" మాత్రమె.  మతహింస, రాజ్యహింస లాగానే   "సిద్ధాంత హింసను" చేస్తూ,  దానిని సమర్ధించుకుంటోంది. [తన రాజ్య కాంక్షతో టిబెట్టుని ఆక్రమించటమే కాకుండా, మన దేశంలో కూడా దురాక్రమణ జరిపి, మనకు అనేక వేల కోట్ల రూపాయల అనవసర సైనిక ఖర్చుకి కారణమైనది.]  వేరే దేశంలో పరిశ్రమలు రాకుండా చేసి,  కమ్యూనిజానికి చెడ్డ పేరు తెస్తోంది.  కానీ తమ దేశంలో అదే పరిశ్రమలని తన ఇష్టారాజ్యంగా [అడిగే వారు ఉండరు కదా] నెలకొల్పి అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టటమే కాకుండా.....మన అంతర్జాలంలో అనేక "దొంగ లింకులు" పెట్టీ.....వాటి ద్వారా అక్కడి[చైనా]ప్రజల మనోభావాలను వక్రీకరించి ప్రపంచానికి చూపిస్తోంది.  
                                                                                
ఎందుకంటే, బూర్జువా దేశాలుగా పిలువబడే పెట్టుబడీదార్ల దేశాలలాగానే చైనాలో కూడా
పేద్ద నగరాలూ....అందులో పెద్ద పెద్ద  ఆకాశాన్ని  తాకే భవనాలూ.....స్టార్ హోటళ్ళూ....వ్యాపార సముదాయాలూ ఉన్నాయి. మరి వాటిలోనికి సామాన్య చైనా పౌరుడు వెళ్ళే అవకాశం ఉన్నదా.....? ఈ విధంగా అక్కడ కూడా ఆర్ధిక అసమానతలు పెరిగి పోవటంలేదా...?? ఈ మొత్తం అభివృద్ధికీ తమ దేశపు కార్మిక శక్తినీ దోచే చేస్తున్నారు. ఇదంతా అక్కడి ప్రజల పూర్తి అంగీకారంతోనే [నెట్లోని దొంగ లింకులు ఫొటోలూ చూసి] జరుగుతోందని అనుకోవాలా.....??? ఒక విధంగా  రాజరికానికీ,  కమ్యూనిజానికీ తేడా లేనంతగా దేశాన్ని భ్రష్టు పట్టించారు అక్కడి బూర్జువా కమ్యూనిస్టు పెద్దలు.   

ఒక ప్రక్క ప్రపంచ దేశాలలో ఉన్న కార్మికులు ఎదో అన్యాయానికి గురి అవుతున్నారనీ, వారిని రక్షించటానికీ తమ దేశమొక్కటే కృషి చేస్తున్నట్లుగా మొసలి కన్నీరు కారుస్తూ.......మరో ప్రక్క  తమ కార్మికులని  వాడుకొని.....అక్కడి నుండి  "అనేక వస్తువులను అతి తక్కువ ధరకు ప్రపంచ దేశాలకి ఎగుమతి చేస్తూ......ప్రపంచ కార్మికులకి పనిలేకుండా చేస్తోంది చైనా".......పైగా ప్రపంచ కార్మికుల సంక్షేమానికి తమ పార్టీ బ్రాంచీలను ఏర్పాటు చేసి వారికేదో మేలు చేస్తున్నట్లుగా కనపడి.....వారి వారి దేశాలనే శత్రువులుగా చిత్రీకరించి.....అక్కడి శ్రామిములను వెర్రి వాళ్ళను చేస్తోంది చైనా కమ్యునిస్టు పార్టీ.  మరోప్రక్క తమ దేశంలో మడుకూ  శ్రామికులను "దేశ భక్తి పేరుతో బ్లాక్  మెయిల్ " చేసి వారిని వెర్రి వాళ్ళని చేస్తోంది.

ఎటు చూసినా చైనా,  ప్రపంచ కార్మికులనే కాదు, తమ దేశపు కార్మికులను  కూడా  వంచిస్తోంది.  ఈ నిజాన్ని చైనా కార్మికులు గుర్తించిన మరుక్షణం చైనాకి కూడా ప్రపంచ నియంత దేశాలకి పట్టిన గతే పడుతుంది. కానీ, అప్పటి దాకా  ప్రపంచ కార్మికులు ఇబ్బంది పడవలసినదే మరి......."చైనా  కార్మికుల్లారా   మేల్కోండి".  
 
                                                    ఇందులోని బొమ్మలు గూగుల్ లోనివి. మిక్సింగ్ కేఅర్‌కె

23, సెప్టెంబర్ 2012, ఆదివారం

డబ్బు చెట్ల నుండీ రాదని తెలుసుకొన్న ఆర్ధిక ప్రధానమంత్రి

 "We need to contain subsidies, money doesn't grow on trees, Manmohan Singh says..." 




మొత్తం మీద ఇన్నాళ్ళ పరిపాలన తరవాత మన ఆర్ధిక ప్రధాన   మంత్రిగారు  డబ్బు చెట్ల నుండీ రాదని తెలుసుకొన్నారు.....చాలా సంతోషం. అవును సార్, డబ్బు చెట్ల నుండీ పుట్ల నుండీ..... ఒహ్ సారీ పుట్ల నుండీ[గనుల నుండీ]వస్తోంది కదా....!!! వచ్చేది మనుషుల... అదే మన దేశం మనుషుల జేబుల్లో నుండే కదా.... వచ్చేదీ.....విదేశీయుల నుండీ కాదు కదా.....మరెందుకండీ విదేశీ మార్కెట్లు నాశనమైపోతున్నాయని తెగ జాలి పడిపోతున్నారు.....మీరు వారి మీద జాలితో మన దేశంలో చేసే పనుల వలన పూర్తి   ప్రపంచ ఆర్ధిక  సమానత్వం  వచ్చే అవకాశం ఉన్నది...వాళ్ళ లాగా మనం కూడా దిగజారిపోయి....!!!

మన ప్రజలకి సబ్సిడీలు ఇవ్వాలంటే చెట్లకి కాసే డబ్బులు కావాలి....కానీ బురుండీ లాంటి దేశాలకి మిలియన్ల డాలర్లు సహాయం చెయ్యటానికి డబ్బును ఏ చెట్టు నుండీ కోసి ఇచ్చారో మన ప్రధాన మంత్రిగారికే తెలియాలి....అదే చెట్టు నుండీ మన దేశం పౌరులకి కూడా ఇవ్వచ్చు కదా.....కామన్ వెల్త్ ఆటల వలన మన దేశానికి మిగిలినదేమిటో......తాను దూరటనికి చాలదు....మెడకో డోలు.

ప్రభుత్వ సొమ్ముతో..... కార్ల నంబరు బాగాలేదని కార్లు మార్చటం, వాస్తు  బాగా  లేదని బిల్డింగులని పడగొట్టి మరి కట్టించుకొన్న అధికారులకీ, మంత్రి వర్యులకీ, ప్రజా ప్రతినిధులకీ డబ్బు ఏ చెట్టుకి కాస్తొందో చెపితే బాగుంటుంది.  తమ
కోసమే రక్షణ  పేరుతో వేల కోట్లు తగలేసు కొంటున్న ప్రజా ప్రతి "నిధులకి" సొమ్ములు ఏ విత్తనం నాటితే వస్తున్నాయీ....? పాలక, ప్రతిపక్షాలు.... వారికి వారే ఒక బిల్లు పెట్టేసుకొనీ,  ఏకగ్రీవంగా తమ జీతాలను, సౌకర్యాలను కోట్లలో  లక్షలలో పెంచుకొన్నప్పుడు  ఆ డబ్బు  ఎవరి జేబులోది, ఏ చెట్టు నుండీ వస్తోందని ఆలోచించారా...??   కేవలం జనం డబ్బు జనం కోసం ఖర్చు పెట్టేప్పుడే వస్తుందా ఈ చె[త్త]ట్ల ఆలోచన....???

ఎన్నికలైయింది మొదలు తరవాత ఎప్పుడో వచ్చే ఎలక్షన్లకి ప్రభుత్వ సొమ్ముతో  ఇప్పటి నుండే విపరీత ప్రచారం   చేసుకొంటూ అనవసర పనికిమాలిన పధకాలని డబ్బు తగలెయ్యటానికి  అధికార పక్షానికి ఏరకం చెట్ల నుండీ డబ్బు వస్తోంది....?  మధ్య మధ్యలో అలిగీ రాజకీయ బేరాలు కుదరక ఉప ఎన్నికలంటూ ప్రభుత్వం చేత వేల కోట్లు ఖర్చు పెట్టటానికి ఎక్కడ నుండీ వస్తోందీ డబ్బూ...???

సభలూ సమావేశాలూ అంటూ లేని పోని ఆవేశ కావేశాలు నటిస్తూ వేల కోట్ల ప్రజాధనం వెదజల్లుతోంది    ఏ విత్తనం నాటితే వచ్చే  డబ్బు........ విత్తమంత్రి గారూ......అక్కడికి మీరొచ్చిన తరవాతే దేశం పైకెక్కడికో పోయిందనీ,  దానిలో ప్రజల భాగసామ్యం ఏమీ లేనట్లు ఎలా  మాట్లాడగలుగుతున్నారు....? ప్రజలు తమ తమ పనుల్లో చాలా చక్కగా నిమగ్నమై చక్కటి అభివృద్ధిని అందిస్తుంటే అదేదో మీ ప్రతిభ అయినట్లు దంబాలు కొట్టుకోవటం  మీకు సబబేనా...??
 

ప్రజాసామ్య దేశంలో ఎంతో బాధ్యతగల పదవిలో ఉన్న వ్యక్తి...ఎదో ఆకతాయి,  బాధ్యత తెలియని పిల్లలతో అన్నట్లుగా ప్రజలని ఉద్దేశించి మాట్లాడటం ఎంతవరకూ సమంజసం...?  ఎంతో బాధ్యతగల దేశ ప్రజలు ఎవరి దారిని వారు పని చేసుకొని వారు అభివృద్ధి చెంది,  దాని ద్వారా దేశాన్ని అభివృద్ధి చేస్తున్న తరుణంలో,  "బాగా చదువుకొన్నామనుకొన్న వారు" కలగ చేసుకోవటం వలననే దేశ ప్రజలు తమ పనులు మానుకొని ఈ చదువుకొన్న వారి తలతిక్క పనులను సవరించే పనిలో పడాల్సి వచ్చింది. దీని వల్లనే మన దేశం కూడా యురోపు దేశాల బాట పట్టనున్నది. "మనం అన్నం తిన్న తరవాత అది లోపలికి వెళ్ళి ఎలా అరగాలో లోప చెయ్యపెట్టి దారి చూపిస్తే ఏమవుతుంతో అదే మన దేశంలో జరుగుతోంది....."

ముందుగా ప్రభుత్వం నడిపేవారు తమ ఇష్టానుసారం వేలకోట్ల ప్రజాధనాన్ని అనవసర  ఖర్చులు చేసి  దుర్వినియోగం  చెయ్యకుండా చూడాలి.   తరవాత,  పేద్ద ఆర్ధిక వేత్తలు తమ విశాల హృదయ వైశాల్యాన్ని కొద్దిగా తగ్గించుకొని స్వంత ప్రజల బాబోగులు చూస్తే ముందు తరాల వారికి మంచి చేసినవారవుతారు.......మన ప్రజల నుండీ వచ్చే డబ్బును మన ప్రజల కోసమే ఖర్చు పెడితే ఏ చెట్టు నుండీ డబ్బు అడుక్కొనే  పరిస్థితి మన దేశ ప్రజలకి కలగదు. 


 జై హింద్


15, సెప్టెంబర్ 2012, శనివారం

రోజుకి Rs. 560 కోట్లు నష్టమా......నమ్మే మాటలేనా ....???





మధ్యకాలంలో అక్కడ నష్టమూ, ఇక్కడ నష్టమూ అని ప్రభుత్వం - ప్రభుత్వరంగ సంస్థలూ ఏదో వ్యాపార సంస్థలులాగా మాటలాడటం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే, ప్రభుత్వాలు - ప్రభుత్వరంగ సంస్థలూ బ్రతికేదే ప్రజల సొమ్ము మీద......, వీరు అమ్మేదీ అదే ప్రజలకి!!!! వ్యవహారంలో నష్టపోవటమనేది ఎక్కడ...? అసలు, వ్యాపార సంస్థ అయినా రోజుకి ఇన్ని కోట్ల నష్టంతో నడిస్తే అవి మనగలుగుతాయా....? కానీ మన ప్రభుత్వ రంగ సంస్థలు  వాళ్ళకి కావాలిసినవి వారు పొందుతూ అలా నడుస్తూనే ఉన్నాయి కదా....వీటికి డబ్బెక్కడి నుండీ వస్తోందీ...? ప్రభుత్వం నుండీ వచ్చే సబ్సిడీల ద్వారానే కదా....మరి తాము పొందే సబ్సిడీలను ప్రజలకి మళ్ళించద్దంటే దానిని ఏమంటారు....??

సబ్సిడీలు అనేదేదో భయంకరమైన మాటగా వాడుతున్నారు. సబ్సిడీల ద్వారా ప్రజలకి అందించబడే సొమ్ము ఎవరిదీ....ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులదా...? గంభీరంగా[నటిస్తూ] మొహాలు పెట్టుకొని ప్రజల సొమ్ముతో బోలెడు జీతాలు కొట్టేసే పేద్ద అధికారులదా...? లేక ఎవరి జేబులో నుండైనా తీసి పెట్టే వ్యక్తిగత సొమ్మా....? ఇవేమీ కాదు. డబ్బు కూడా ఏక మొత్తంగా ప్రజల జేబుల్లో నుండి రకరకాలుగా టాక్సుల పేరుతో సంపాయించినదే కదా...!!! సొమ్ములో నుండి కొంత సొమ్మును ప్రజల నిత్యావసరాలైన కొన్ని వస్తువుల ధరలు నియంత్రించటానికి వాడబడుతున్నదే కదా "సబ్సిడీ" అనే మాట. అంటే ప్రజల నుండీ అధిక మొత్తంలో వసూలు చేసి, దానిలో నుండి కొద్ది సొమ్మును తిరిగి ప్రజల అవసరాలకి ఖర్చు పెట్టటం ప్రభుత్వానికి నష్టమా...?

దేశంలోని ప్రజలందరూ ఒకే రకమైన సంపాదనతో ఉండటం అనేది జరగదు...ఎక్కువ సంపాయించిన వారు ఎక్కువ సౌకర్యాలను పొందుతారు, తక్కువ సంపాయించిన వారు దానికి తగ్గట్లు బ్రతుకుతారు....కానీ, వీరందరికీ కావాలిసిన కనీస సౌకర్యం తిండీ, బ్రతుకుతెరువు కోసం తిరగటం అనేది ముఖ్యమైనవి...వీటి కోసం ప్రజలను విభజించటం పద్ధతి కాదు కనుక, వీటిని బీద బిక్కీ తేడా లేకుండా అందరికీ ఒకే సరాసరి తగ్గింపు ధరలకి ఇవ్వటానికే సబ్సిడీ అని ఇచ్చి, మరొక రంగం వైపునుండీ వచ్చిన డబ్బును నిత్యావసరాలకి వాడుతున్నారు. డబ్బు ఎక్కడి నుండీ వచ్చినా అదీ ప్రజల డబ్బే.....అంతే గానీ ఎవరి జేబులోనుండీ వచ్చినది కాదు.

ఇంతకీ విచిత్రం ఏమంటే, నష్టాలు, సబ్సిడీలూ అంటూ మాట్లాడే వారు ఎవరూ...? వారి వారి ఏసీ రూముల్లో నుండి బయటకు రాకుండానే, బట్టలు నలగ కుండానే, ప్రభుత్వం ఇచ్చే ఉచిత సౌకర్యాలను[ప్రజల సొమ్ముతో] ఏమాత్రం సిగ్గు పడకుండానే వాడుకుంటూ మాటలాడుతున్న పేద్ద పేద్ద ఉద్యోగులూనూ, పేద్ద ప్రజా నాయకులూనూ.... ప్రజల సొమ్ముతో వ్యాపారం చేస్తూ, ప్రజలకే అమ్ముతూ, వాటిల్లో వచ్చే హెచ్చు తగ్గులను ప్రజల సొమ్ముతోనే సరిచేసుకుంటూ....... నష్టాలూ, సబ్సిడీలు వద్దూ అని తల్లడిల్లిపోయేవారు ప్రజా నాయకులవుతారా...? ప్రజా సేవకులవుతారా...? వీరిని ప్రజాప్రభుత్వ సేవకులూ, నాయకులూ అనాలా లేక కార్పోరేటు కంపనీల చైర్మన్లు అనాలా.....??? ఒక్కో కంపనీ కార్పొరేట్ లెవెల్లో ఏసీ ఆఫీసులూ, ఏసీ కార్లూ, లక్షలలో జీతాలూ, అనేక స్వంత సౌకర్యాలూ....వీటిల్లో మాత్రం లోటూ రాకూడదు మరి.

ప్రజలకి ఏదన్న చెప్పాలంటే ముందరగా, ప్రభుత్వం మరియూ పబ్లిక్ వ్యాపార సంస్థలూ కొన్ని త్యాగాలు చేసి చూపించి, తరవాత ప్రజల దగ్గరికి వెళ్ళాలి. అంటే తమ డాంబిక, రాజరికమైనటువంటివి వదలి, మామూలు ఆఫీసులూ, అవసరమైనంత వరకూ తక్కువ సౌకర్యాలను పొంది, ఖర్చులు తగ్గించి, అప్పటికి కూడా ఇంకా మార్పు కావాలంటే ప్రజలకి అప్పుడు చెపితే బాగుంటుంది.......                                     

ఇందులోని బొమ్మలన్నీ గూల్‌వే....మిక్సింగ్ కె ఆర్ కె  

13, సెప్టెంబర్ 2012, గురువారం

జై తెలుగోడా.... తెలుగు వారికి సందేశం

60 ఏళ్ల క్రిందట తెలుగు వారికి   ఘంటసాల గారి  సందేశం
 


నూతనాంధ్రదేశ నిర్మాతలారా....నవయువకులారా........

రాష్ట్రమంటే సరదా కాదు, పరాకు పనికిరాదు.....

మాటలిక మానుడోయ్ మాన్యులారా..... 

కళ్ళు మూసుకొని ఒళ్ళు చూసుకొని 
కాలం గడపకు తెలుగోడా....
చల్లని భాగ్యం కలవాడా...
బహు చల్లని భాగ్యం కలవాడా...

కళ్ళు మూసుకొని ఒళ్ళు చూసుకొని 
కాలం గడపకు తెలుగోడా....
చల్లని భాగ్యం కలవాడా...
బహు చల్లని భాగ్యం కలవాడా...

తెలుగు సోదరులలో చెలిమి లేదనీ అపనింద బాపూ....
దేశ దేశాలలో తెలుగుల ఖ్యాతి నింపీ.....
రంగారు, బంగారు పంటలు పండించూ...
రైతు కూలీ జనులు హాయి హాయి అనగా...... 
కూడూ గుడ్డ పాడి పంటలతో పాడుతో సాగాలొయ్... 

కూడూ గుడ్డ పాడి పంటలతో పాడుతో సాగాలొయ్...
మేడలు గుడిశలు తేడా నశించి తోడు నీడగా బ్రతకాలొయ్....

మేడలు గుడిశలు తేడా నశించి తోడు నీడగా బ్రతకాలొయ్....
కళ్ళు మూసుకొని ఒళ్ళు చూసుకొని కాలం గడపకు తెలుగోడా....
చల్లని భాగ్యం కలవాడా...
బహు చల్లని భాగ్యం కలవాడా... 

మన వాడలలో........మన పల్లెలలో.......
మన వాడలలో మన పల్లెలలో 
సిరి సంపదలే కురవాలొయ్.....

మన వాడలలో మన పల్లెలలో 
సిరి సంపదలే కురవాలొయ్.....
విశాలాంధ్ర వైభవమును చూసీ 
దేశము గర్వము పొందాలొయ్.....

విశాలాంధ్ర వైభవమును చూసీ 
దేశము గర్వము పొందాలొయ్.....
కళ్ళు మూసుకొని ఒళ్ళు చూసుకొని 
కాలం గడపకు తెలుగోడా....
చల్లని భాగ్యం కలవాడా...
బహు చల్లని భాగ్యం కలవాడా...


@@@@@<><><><><><><><><><>@@@@@
దీనిని రచించినది "బాబ్జిఅని రికార్డుమీద ఉన్నది
ఎప్పుడో అరవై ఏళ్ళ క్రిందటి పాట అనుకుంటా ..........
@@@@@<><><><><><><><><><>@@@@@

కైకలూరులోని ఒకానొక స్కూలులో 
పాత 78 ఆర్పీఎం గ్రాంఫోను రికార్డులు కనపడినాయి.....
అందులో ఒకానొకటి పైన ఉన్న ఘంటసాల గారి పాట..... 
రికార్డుని తెచ్చి నా గ్రాంఫోను మీద పలికించి 
ఇక్కడ పెడుతున్నాను వినండి......

<><><><><><><><><><><><><><><><><><>
<><><><><><><><><><><><><><><><><><><>


జై తెలుగోడా...


జై హింద్



రాష్ట్ర విభజన-దానికి ముందు-తరవాత పరిణామాలకి సంబంధించిన అన్ని వ్యాసాలు:
లింకులు నొక్కండి


2] రాజుల సొమ్ము రాళ్ళపాలు...కాదు..కాదు..మంత్రుల పాలు...


3] భాషాయుక్త రాష్ట్రాలా లేక కాంగ్రెస్సు[కు]యుక్త రాష్ట్రాలా.....!!!


4] ఇంతకీ తెలంగాణా ఎక్కడున్నది.........????


5] తలకాయలేని నాయకులు చేసిన గుండె లేని ఆంధ్రా.......!!!


6] ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ పెట్టాలి....???