LOCAL WEATHER

31, జులై 2012, మంగళవారం

ఒలింపిక్స్ నిజంగా ప్రపంచ క్రీడలేనా....?





ఇన్ని కోట్ల జనాభా గల మన దేశానికి ఒక్క బంగారు పతకం రావటంలేదేమిటీ.....అని "మన దేశాన్ని మనం తిట్టేసుకొని, గౌరవం పొందేవాళ్ళలో నేను ఒకడినే"...కానీ ఆలొచిస్తే ఆటలన్నీ మనకు రానివేనా?...... లేక మన దేశాల్లాంటి వారికి రాకుండా ఉండే ఉద్దేశంతో పెట్టారా ......అన్న ఆలోచన కూడా ఉన్నది......

క్రీడలు అదే.... ఆటలు అంటే దేని కోసం...? ఆటలు ఆడేది ఆనందం కోసమేనా....?? ఒక వేళ ఆటలు అనేవి మన మానశిక, భౌతిక ఆనందాన్ని పెంచేవే అయితే.....ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఆనందాన్నీ ఒలింపిక్స్ ఆటలు ప్రతిబింబిస్తున్నాయా....???

దీనికి మొహమాటం లేకుండా "లేదనే" సమాధానం చెప్పవచ్చును. దీనికి ఒలింపిక్స్లో జరికే రకరకాలైన ఈదటాలు, కాల్చటాలు, బాణాలు వెయ్యటం, పరిగెత్తటం, దూకటం, దూకి పరిగెత్తటం, బోలెడు బరువులెత్తటం, సర్కస్ విద్యలు[జిమ్నాస్టిక్స్], విసరటం లాంటి ఆటలని ఉదాహరణగా తీసుకోవచ్చును. మరి వీటినే ఎందుకు ఉదాహరణ క్రింద తీసుకోవలంటే.....ఇవి కొన్ని వందల కోట్లమంది ప్రజలున్న ప్రపంచంలో కొన్ని వేలమంది మాత్రమే ఆడే ఆటలు. ఒక్కో ఆటకీ పాతిక నుండీ వంద దాకా పతకాలు ఇవ్వబడతాయి.....పైగా ఒక్కొక్కరికీ 5 నుండీ 10 పైగా పతకాలు వచ్చే అవకాశం ఉన్నవీనూ....పోనీ ఇవేమన్న సహజరీతిన ఆడతారా అంటే పూర్తి అసహజ పద్దతిలో ప్లాస్టిక్ మైదానాల పైనా, ఖరీదైన కొలనులలోనూ,....ముళ్ళ బూట్లతోనూ.... రాక్షస సాధనతో ఆడేవే కానీ.......కనీసం ఆడే వాళ్ళకైనా ఆనందానిచ్చేవి కావు.

ఇక ఒలింపిక్స్లో ఆడేవన్నీ నూటికి 99 దాకా యూరప్పువారికే వచ్చినవి. లేదా ఎప్పుడో గ్రీకులు ఆడిన ఆటలు. [ మధ్యన చైనా, కొరియాలు లాంటి దేశాలు కూడా యూరప్పు అహంకారాన్ని వంటబట్టించు కొన్నాయి అనుకోండి]. మిగిలిన ఖండాలలో ఆడే ఆటలను గుర్తించనేలేదు...దీనికి మూలం వారే ప్రపంచ విజేతలవ్వాలి... అనే వారి యొక్క ఆరాటమే.....


దీనికి ఉదాహరణగా కోట్లమంది ఆడే క్రికెట్టునీ, దక్షిణాసియాలో ఆడే హాకీనీ తీసుకోవచ్చును. మొదటగా క్రికెట్టు...ఇది వారి ఆటైనప్పటికీ వారి చేతుల్లోంచి జారిపోయింది. కాబట్టి ప్రక్కనబెట్టారు...ఇక హాకీ విషయానికొస్తే డజన్లకొద్దీ ఆటగాళ్ళు ఆడగా ఆడగా చివరికి ఆట మొత్తానికీ 3 పతకాలు మాత్రమే ఇస్తారు.....ప్రతీ ఆటలో ప్రతీ గోలుకీ ఒకటి ఇవ్వచ్చుగా....ఇవ్వరు. ఇలా మాత్రం ఒకటీ రెండు పతకాలు కూడా ఇతరులకి రావటం ఇష్టం లేని యూరప్పువారు మైదానంలో మేట్ వేసి ఆడాలని నిబంధన పెట్టారు......దానితో అప్పటిదాకా చాంపియన్లుగా ఉన్న భారత్ మరియూ పాకిస్తానులు వెనుకబడి, వీటిలో ఆడే అర్హత పొందటానికే కష్ట పడాల్సి వస్తోంది.


ఇక, వారికి ఇష్టమైన ఆటలు తీసుకొన్నప్పటికీ, వాటిలోనూ అన్యాయమే!!! గ్రౌండులో క్రింద కాస్ట్లీ ట్రాకుల మీద, ఆటగాళ్ళు పదునైన బూట్లు వేసుకొని ఆడతారు. పూర్తిగా అసహజమైన రీతిలో జరుగుతాయి....ఖరీదైన ఈతకొలనులూ, పరుగుల ట్రాకులూ, హాకీ మైదానమంతా మేట్లు లాంటి అసహజమైనటువంటి భారీ ఖర్చుగల ఏర్పాట్లు అన్నిదేశాలలో అందుబాటులో ఉంటాయా.....???


పైగా ఇంకోవిషయమేమంటే సర్కస్సులలో జంతువులనే వాడద్దనే జాలీ దయా అంటూ దొంగ మాటలు చెప్పే [అక్కడా మాయే] వీరు, ఆటల కోసం పసిపిల్లల చేత భయంకరమైన కఠినమైన కఠోర సాధన చేయించి....ప్రమాదకరమైన ఫీట్లు చేయించి పతకాలు సంపాయిస్తారు.

COURTESY: http://en.nkfu.com/sport-quotes/

ఇవి ఇలా కాకుండా సహజమైన వాతావరణంలో, సహజ రీతిన జరగాలి. ఆడే ఆటగాళ్ళకి పదునైన బూట్లు లాంటి ప్రత్యేక ఏర్పాట్లు లాంటివి ఏవీ ఉండ కూడదు. ఒలింపిక్సు లో ప్రపంచంలో ఎక్కువ జనాభా ఆడే ఆటలన్నీ పొందుపరచాలి. నిజంగా వీరికి ఆటలను ప్రోత్సాహించాలనే ఉంటే...... ఆటలు ఆరంభానికీ, అంతానికీ అయ్యే అనవసర భారీ ఖర్చుని ప్రపంచంలోని ఆసక్తిగల ఆటగాళ్ళ ప్రతిభని వెలికి తీయటానికి ఉపయోగిస్తే బాగుంటుంది. తరవాత ఒక్కో ఈవెంటుకీ 3 రకాల పతకాలమించి ఇవ్వరాదు. ఒక వేళ ఎక్కువ పతకాలు ఇవ్వాలంటే, పద్దతిని అన్ని ఆటలకీ వర్తింపచేయాలి. అప్పుడే ఆటల వలన వచ్చే ఆనందాన్ని అందరికీ పంచినట్లవుతుంది. అప్పుడే ఒలింపిక్సు ప్రపంచ క్రీడలవుతాయి. లేక పోతే ఆటలు బయటెక్కడైనా ఆడుకొని, పిల్లలని ప్రభావితం చేసేవి కాకుండా కేవలం టీవీలలో మాత్రమే ఆడే ఆటలవుతాయి.........కొందరి ఆధిపత్యానికి గుర్తుగా మాత్రమే మిగిలిపోతాయి. .


ఇందులోనివి గూగుల్ బొమ్మలే