LOCAL WEATHER

17, మే 2012, గురువారం

అది ఒక ఇదిలే

"అది ఒక ఇదిలే" అనే పాట మనకు సుపరిచితమే.... "ప్రేమించిచూడు" చిత్రంలో పీ.బీ. శ్రీనివాస్ మరియు పీ.సుశీలా పాడారు. అయితే పాటని మన మాస్టారు వేణుగారు స్పేనిష్ పాట "Bésame Mucho" నుండి స్పూర్తిని పొందినట్లు  కనపడు....వినపడుతున్నది.

యురప్పులోకూడా దీనిని అనేకమంది పాడారు. వారిలో Consuelo Velázquez, Dean Martin, Elivis Presley, The Beatles, Tino Rossi.........వినండి క్రింది mix పాట మీకోసం.



ఇందులోని బొమ్మలు గూగుల్లోనివే

11, మే 2012, శుక్రవారం

మీడియా మాఫియా!!!


మీడియా మాఫియా!!!

రోజున మన నాలుగో స్థంభంలో ఉన్న అనేక "కటికరాళ్ళ టీవీలనూ, పత్రికలనూ" చూస్తున్నాము. అవి నిజంగా ప్రజాసామ్యానికి "నాలుగో స్థంభంగా" వ్యవహరిస్తున్నాయా....? ప్రతీదానికీ ఏదో ఒక స్వంత ఎజండా ఉన్నది. ఎజెండాలో భాగంగానే అవి నడుస్తున్నాయి. అయితే విచారకరమైన విషయం ఏమంటే, అనేక వాటిల్లో[ఏ ఒక్క దానిలో] "ప్రజా ఎజండా" లేనేలేదు.

ఒక టివీ కులానికి కొమ్ము కాస్తుంటే, మరొకటి 'వ్యక్తి ఆరాధనే' అంటూ దురభిమానం వ్యాపింపచేస్తొన్నది. ఇంకొన్ని కొందరి రాజకీయ నాయకుల ప్రచార సంస్థలు, మరికొన్ని ఏదో ఒక రకంగా బ్లాక్-మెయిల్ చేసి పబ్బం గడుపుకుంటున్నాయి. మరికొన్ని "ఇజాల టీవీలు" తమ ఇజంలోని తప్పులని, ఒప్పులుగా ప్రచారం చెయ్యాటానికి ఉపయోగిస్తున్నాయి. చివరికి ఇవన్నీ డబ్బు సంపాదనే పరమావధిగా పని చేస్తున్నాయే తప్ప, ప్రజల కోసం కాదు.


అనేక అనవసర కేసులలో సామాన్యులు ఇరుక్కున్నప్పుడు ఇవేమీ స్పందించవు. వాటిలో తమకేదైనా ప్రయోజనం ఉంటే తప్ప......ఇలా నడుస్తున్న టివీలు ప్రచారం తమ చేతుల్లోనే ఉన్నది కదా అని, తమని తాము దేవతలతో పోల్చేసుకొని, తాము లేకపోతే దేశమంతా ఎదో జరిగిపొతుందని ప్రజలని భయభ్రాంతులని చేస్తున్నాయి.


నిజానికి ప్రజాసామ్యానికి పనికి వచ్చే పనులు మాత్రమే చేస్తున్న నాలుగో స్తంభం ఎక్కడ ఉన్నది....పురాణకాలంలో, "ఇందుగలడు అందు లేడని సందేహము వలదు...." అని దేవుడి గురించి అనగానే, ఒక స్తంభంలోనుండి దేవుడే దిగి వచ్చినట్లు........ఇప్పుడు, [4]స్థంభం నుండి అవినీతి, బ్లాక్ మేయిలర్స్, మాఫియా వస్తున్నారు. విధంగా మీడీయాని అడ్డం పెట్టుకొని అడ్డమైన పనులూ చేస్తున్న పెద్దమనుషులని పట్టుకోవటానికి ప్రజాసామ్యబద్ధమైన రాజ్యాంగానికి, చట్టానికి కూడా అధికారం లేదా...?

ప్రతీదానికీ ఒక సంఘం పెట్టుకొని తామేదో అతీతులమనీ, తమకి తాము సర్వాంతర్యాములమనీ, తాము చేసేదంతా లోకకల్యాణానికే అనీ, తమకేమైనా ఆపద వస్తే .....లోకానికే ఆపద వచ్చినంత గొడవ చేస్తున్నారు. విధంగా అందరూ అన్నిటీకీ అతీతులైతే మరి రాజ్యాంగ బద్ధంగా, చట్ట బద్ధంగా బ్రతికేదెవరూ.....సామాన్య ప్రజలా. చట్టం తనపని తాను చేసుకుని పోయేది కేవలం సామాన్య ప్రజల దగ్గరేనా....?

రకరకాల మాఫియాలంటు గగ్గోలెత్తించే మన నాలుగోస్తంభం, తనదాకా వచ్చేటప్పటికి కాకుల్లాగా గోల చేస్తంది. వ్యక్తికైనా స్వంతంగా ఒక మీడియా ఉంటే వారు చట్టానికి అతీతులా....? అందులోని ఉద్యోగులు మిగిలిన సంస్థలు లాంటి ఉద్యోగులు కారా......?

ఉద్యోగులు కేవలం మీడియాలోనే లేరు, అనేక లాక్ అవుట్ అయిన సంస్థల్లో కూడా ఉన్నారు. వారు, ఒళ్ళు అలవకుండా ఒకచోట కూర్చుని కాగితాలని ఖరాబు చేసే వాళ్ళకన్నా ఎక్కువే...... ఆయా సంస్థల్లో అనేకం గవర్నమెంటు చర్యల వలన మూత పడినవీ ఉన్నాయి. మొన్నటికి మొన్న "గాలి" మూలంగా అసలు ఇనుప ఖనిజాన్నే తవ్వద్దని కోర్టు రూలింగు ఇచ్చింది. ప్రస్తుతం ఇసుక మాఫియాల ఆగడాల వలన ఇసుకనే తీయద్దని హైకౌర్టు చెప్పింది. సుప్రీంలో కూడా అదే మాట. మరి వీటివలన ప్రత్యక్షంగా కొన్ని వేలమంది లక్షల మంది నిరుద్యోగులు కాగా.......పరొక్షంగా కొన్ని కోట్లమంది ఇబ్బంది పడుతున్నారు. లక్షలాది మంది రోజువారీ కూలీలు రోడ్డున పడ్డారు. మరి వీరికన్నా మీడియా ఎక్కువా.......? చేతులో ప్రచార సాధనాలున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి "సింపతీ" సంపాయించుకోవలని చూస్తున్నాయి మన "మీడియా రాతి స్థంభాలు".


ప్రజాసామ్యాన్ని మేమే నిలబెడుతున్నాము, చట్టం మా వలననే పనిచేస్తోంది అనే ఈ పెద్దమనుషులలో ఎంతమందికి చట్టం మీద, రాజ్యాంగం మీద గౌరవం ఉన్నది.....ఎందుకంటే, వారు ఎవరో కక్ష సాధింపుకి, లేక వేరెవరో రాజకీయంగా దెబ్బతీయటానికే అని అంటూ [తాము చేసిన చేస్తున్న తప్పులని కప్పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నారు...] ప్రచారం చేస్తున్న వీరికి నిజంగా  దేశం మీద, చట్టం మీద, కోర్టుల మీద, రాజ్యాంగం మీద గౌరవం వుంటే....తమ మీద వచ్చిన అభియోగాలని న్యాయ పరంగానే ఎదుర్కొని తమ నిజాయితీ నిరూపించుకోవాలి..... లేదూ, అవన్నీ సామాన్య ప్రజలకోసం మాత్రమే తమలాంటి కారణజన్ములకి కాదంటే, ఇక మన ప్రజాస్వామ్యాన్ని దేవుడు కూడా కాపాడ లేడు.



ఇందులోని
చిత్రాలు గూగుల్ లోనివే

5, మే 2012, శనివారం

తెలుగు చార్లి చాప్లిన్


ఆయన ఒక సామాజిక కార్టూనిస్టు. ఎందుకంటే, దరిదాపులు ఆయనవేసే అన్ని కార్టూన్లూ సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని సృష్టించినవే కనపడతాయి. సమాజంలోని రుగ్మతలని చక్కగా చూపిస్తూ....వాటిని హాస్యంగా మలిచి మనకు ఇట్టే అర్ధమయ్యే భాషలో వేస్తుంటారు. అయానే "బాబు" అనబడే శ్రీ కొలను వెంకట దుర్గా ప్రసాదు గారు.




"బాబు" గారు వేసే కార్టూన్లని చూస్తుంటే నాకు చార్లీ చాప్లిన్ సినిమాలే గుర్తొస్తాయి. చార్లీ చాప్లిన్, సమాజంలోని సామాన్యుని బాధలన్నీ హాస్యంతో మేళవించి చాలా చాక్కగా చిత్రీకరించారు.

"బాబు" గారి కొన్ని కార్టూన్లని, కొంత ఆడియో చేర్చి "మీ స్వరం"లో అదే యూట్యూబులో పెట్టాను. చూసి విని ఆనందించండి. ఇందుకు అనుమతించినందుకు శ్రీ కొలను వెంకట దుర్గా ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.


ఇంతకుముందే ఈ ప్రయోగం చేసి "మీ స్వరం"లో పెట్టాను అవి కూడా చూసి ఆనందించండి.




మీరు ఆయన కార్టూన్లన్నీ చూడాలనుకొంటే "బాబు" గారికి స్వంత బ్లాగు ఉన్నది. "బాబు కార్టూన్స్" లింకు నొక్కండి.